శనివారం, 14 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 14 డిశెంబరు 2024 (08:06 IST)

చియాన్ విక్రమ్, మడోన్ అశ్విన్, అరుణ్ విశ్వ కాంబినేషన్ లో చిత్రం

Chiyan Vikram, Madon Ashwin, Arun Vishwa
Chiyan Vikram, Madon Ashwin, Arun Vishwa
వెర్సటైల్ హీరో చియాన్ విక్రమ్, మండేలా, మావీరన్ (తెలుగులో మహావీరుడు)చిత్రాలతో ప్రశంసలు అందుకునన్న క్రియేటివ్ డైరెక్టర్ మడోన్ అశ్విన్‌తో సినిమా చేయనున్నారు. ఈ చిత్రానికి #Chiyaan63 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు, శాంతి టాకీస్‌ పై నిర్మాత అరుణ్ విశ్వ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రోజు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు,  ఈ కాంబినేషన్ అశ్విన్ క్రియేటివిటీ, విక్రమ్ పవర్‌హౌస్ పెర్ఫార్మెన్స్ బ్లెండ్ చేసి మరపురాని సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించనుంది.
 
మడోన్ అశ్విన్ విక్రమ్ కు సరిపోయే సబ్జెక్ట్ తో సరికొత్త కోణంలో చూపించబోతున్నారు. ఈ చిత్రం త్వరలో ప్రారంభమవుతుంది.
 
నిర్మాత అరుణ్ విశ్వ మాట్లాడుతూ..“దేశంలోని అత్యుత్తమ నటులలో ఒకరైన చియాన్ విక్రమ్ సర్‌తో కలిసి మా ప్రొడక్షన్ నంబర్ 3ని ప్రకటించడం మాకు చాలా సంతోషంగా వుంది. అతని ప్రయాణం ఎందరికో స్ఫూర్తినిస్తుంది. మనకు ఎన్నో చిరస్మరణీయమైన పాత్రలు, సంచలనాత్మక చిత్రాలను అందించిన నటుడితో చేతులు కలపడం మాకు గౌరవం. ఈ చిత్రానికి మండేలా, మావీరన్‌లను అందించిన అత్యుత్తమ డైరెక్టర్ మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించనున్నారు. ప్రొడక్షన్ హౌస్‌గా, మేము రెండవసారి మడోన్‌తో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. మేమంతా కలిసి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించే చిత్రాన్ని అందించబోతున్నాం' అన్నారు
ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.