శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 20 జూన్ 2019 (15:05 IST)

బ్రహ్మానందం, అలీకి బంపర్ ఆఫర్.. పుంబా, టీమోన్‌లకు డబ్బింగ్ చెప్పనున్నారోచ్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హాస్య నటులుగా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారు హాస్యనటులు బ్రహ్మానందం, అలీ. ప్రస్తుతం వీరిద్దరికీ ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. గతంలో టాలీవుడ్ ప్రముఖులకు డబ్బింగ్ చెప్పిన అవకాశాలు లభించాయి. ఈ కోవలో రానా (అవెంజెర్స్ ఎండ్ గేమ్), అల్లావుద్ధీన్ సినిమాకు వెంకీ వరుణ్ డబ్బింగ్ చెప్పుకున్నారు. 
 
ప్రస్తుతం అలాంటి ఆఫర్ హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, అలీలకు లభించింది. ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ రూపొందించిన యానిమేటెడ్ చిత్రం "ద ల‌య‌న్ కింగ్'' 1994లో వచ్చిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాను 3డి ఆనిమేటెడ్‌ టెక్నాలజీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా తెలుగు వర్షన్ డబ్బింగ్ చెప్పేందుకు అలీ, బ్రహ్మానందం ఫిక్సయ్యారు. 
 
తెలుగు వెర్ష‌న్‌లో కూడా రిలీజ్ కానున్న ఈ సినిమాలో పుంబా (అడవి పంది) పాత్ర‌కు బ్ర‌హ్మానందం, టీమోన్ (ముంగీస) పాత్ర‌కు ఆలీ డ‌బ్బింగ్ చెప్పారు. ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది.


ఇప్పటికే, అల్లావుద్దీన్ సినిమాతో మూవీ లవర్స్‌ని అలరించిన డిస్నీ సంస్థ.. ఇప్పుడు లయన్ కింగ్ రూపంలో మరోసారి అలరించబోతున్నారు. ది జంగిల్ బుక్, ఐర‌న్ మ్యాన్’ సినిమాల ద‌ర్శ‌కుడు జాన్ ఫేవ‌రోవ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన సంగతి తెలిసిందే.