ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 16 మార్చి 2020 (20:05 IST)

టెన్షన్‌లో నాని, రాజ్ తరుణ్, ప్రదీప్..!

నాని, సుధీర్ బాబు, నివేథా థామస్, అదితీరావు కాంబినేషన్లో ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన చిత్రం వి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు. ఉగాది కానుకగా ఈ సినిమాని మార్చి 25న రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే... గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ ఎంతలా వణికిస్తుందో తెలిసిందే. అందుచేత వి సినిమా వాయిదా పడనున్నట్టు టాలీవుడ్‍లో టాక్ వినిపించింది. 
 
ఇప్పుడు వి సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు తెలియచేస్తూ... శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ ఓ ప్రకటనను విడుదల చేసింది. ముందుగా ఎనౌన్స్ చేసినట్టుగా మార్చి 25న వి సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేశామని... అయితే... ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తమ నిర్ణయాన్ని మార్చుకున్నామని శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ తెలిపింది. ప్రేక్షకుల ఆరోగ్యం, క్షేమం తమకు ముఖ్యమని... అది తమ బాధ్యత అని చెప్పింది. సినిమా విడుదలను వాయిదా వేస్తున్నామని... వి మూవీని వచ్చే నెలలో విడుదల చేస్తామని తెలిపింది. 
 
ఈ నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరింది. వి సినిమా ఇలా వాయిదా పడడంతో.. నాని ఆలోచనలో పడ్డారని టాక్. మార్చి 25న రాజ్ తరుణ్‌ నటించిన ఒరేయ్ బుజ్జి సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేసారు. ఈ చిత్రానికి కొండ విజయ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇటీవల రాజ్ తరుణ్ నటించిన సినిమాలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. మూవీ రిలీజ్ టైమ్ దగ్గర పడుతున్న ఈ టైమ్‌లో థియేటర్స్ బంద్ ప్రకటించడం... ప్రస్తుతం నెలకొన్న  పరిస్థితులు రోజురోజుకు తగ్గకుపోగా ఇంకా పెరుగుతుండడంతో.. రాజ్ తరుణ్ టెన్షన్ పెడుతున్నారని తెలిసింది. 
 
అలాగే యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన సినిమా 30 రోజుల్లో ప్రేమించటం ఎలా..? ఈ సినిమాని కూడా మార్చి 25న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు. ఈ సినిమాపై ప్రదీప్ చాలా నమ్మకం పెట్టుకున్నాడు. దీంతో ప్రదీప్ కూడా ఆలోచనలో పడ్డారని తెలిసింది. మరి.. ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయినా సక్సెస్ సాధించాలని కోరుకుందాం.