శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 మార్చి 2020 (13:40 IST)

ఐశ్వర్యా రాజేష్‌కు పెళ్లైందా? ఆ ఫోటోలే కారణం..!

Aishwarya Rajesh
ఐశ్వర్యా రాజేష్‌కు పెళ్లైందని సోషల్ మీడియాలో వదంతులు వస్తున్నాయి. ఇందుకు ఐశ్వర్యా రాజేష్ పోస్టు చేసిన ఫోటోనే కారణం. యాంకర్‌గా తన జీవితాన్ని ప్రారంభించిన ఐశ్వర్యా రాజేష్ తమిళ్‌లో ధనుష్, విక్రమ్ సరసన నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో పరిచయం అయి తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రంలో నటించింది. ఈ సినిమాలో సువర్ణ అనే పాత్రలో నటించి ప్రేక్షకులను ఫిదా చేసింది ఈ భామ. 
 
తాజాగా ఈ భామకి పెళ్లి అయ్యిందా.. అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో తన పాపిటిపై కుంకుమ పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోటోను చూసి నెటిజన్లు పెళ్లి చేసుకున్నావా అని కామెంట్స్ చేస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో అలాంటిది ఏమీ లేదని మరుసటి రోజు మరో ఫొటో పోస్ట్ చేస్తూ.. 'సింగిల్ అండ్ హ్యాపీ' అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఐశ్వర్య తెలుగులో నాని హీరోగా నటిస్తున్న 'టక్ జగదీశ్' లో హీరోయిన్‌గా నటిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రితూ వర్మ మరో హీరోయిన్‌గా నటిస్తోంది.