డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?
ఈ ఏడాది గుంటూరు కారంతో పాటల పరంగా హిట్ కొట్టిన సంగీత దర్శకుడు థమన్ అదే స్పూర్తితో డల్లాస్ లో స్పైసీ టూర్ వేయనున్నట్లు పోస్టర్ విడుదల చేశారు. డల్లాస్, అలెన్ ఈవెంట్ సెంటర్‌లో మీ జూన్ 1వ తేదీని మసాలా దిద్దడానికి సిద్ధంగా ఉండండి!మేము వైబ్ చేస్తున్నప్పుడు మరపురాని రాత్రి కోసం మాతో చేరండి. ఈ సీజన్‌లోని హాటెస్ట్ టూర్‌ని మిస్ అవ్వకండి అంటూ ట్వీట్ చేశాడు.
“గుంటూరు కారం” మహేష్ బాబు కెరీర్ లో మరో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిందని చిత్ర యూనిట్ ప్రకటించింది.. అయితే ఈ సినిమాకి సంగీత దర్శకుడు థమన్ ఇచ్చిన ఆల్బమ్ లో ఉన్న సాంగ్ సినిమాలో లేని సాంగ్ 7వ సాంగ్ కోసం ఎప్పుడు నుంచో అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ, థమన్ ఇచ్చిన ఓ మిరపకాయ్ హింట్ తో ఖచ్చితంగా ఇది గుంటూరు కారం 7వ పాట కోసమే అని ఫ్యాన్స్ అంతా ఫిక్స్ అయ్యిపోయారు. అయితే ఆ పాటను డల్లాస్ లో విడుదలచేస్తాడేమోనని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.