గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 28 ఆగస్టు 2024 (15:53 IST)

తమిళ్, మలయాళం, కన్నడ ఇండస్ట్రీ పెద్దలను ఆహ్వానించిన దామోదర్ ప్రసాద్, సి. కళ్యాణ్

Damodar prasad, siva rajkumar family
Damodar prasad, siva rajkumar family
తమిళ్, మలయాళం, కన్నడ ఇండస్ట్రీ పెద్దలను నేడు  దామోదర్ ప్రసాద్, సి. కళ్యాణ్ ఆహ్వానించారు. రవి  కొత్తర్కర (ఎస్ ఐ ఎఫ్ సి సి, ఎఫ్ ఎఫ్ ఐ ప్రెసిడెంట్), కర్ణాటక ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ సురేష్,  సెక్రటరీ హరీష్ మరియు ఆఫీస్ బేరర్స్ ను కలిసి నందమూరి బాలకృష్ణ గారి స్వర్ణోత్సవ వేడుకలకు తెలుగు సినీ ఇండస్ట్రీ తరఫున ఆహ్వానిచ్చారు.
 
నందమూరి బాలకృష్ణ గారు సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1న  హైదరాబాద్ హైటెక్స్  నోవోటెల్ హోటల్లో  తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేశారు. తమిళ్ మలయాళం మరియు కన్నడ ఇండస్ట్రీ కి సంబంధించిన సెలబ్రిటీస్ హీరో శివ రాజ్ కుమార్ గారిని, హీరో విజయసేతుపతి గారిని, హీరో శివ కార్తికేయన్, హీరో కిచ్చ సుదీప్, హీరో దునియా విజయ్, దర్శకులు పి. వాసు, యాక్టర్ నాజర్ గారిని, నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ గారిని, హీరోయిన్స్ సుహాసిని గారు, మీనా గారు, మాలా శ్రీ గారు, సుమలత గారిని, రవి  కొత్తర్కర (ఎస్ ఐ ఎఫ్ సి సి మరియు ఎఫ్ ఎఫ్ ఐ ప్రెసిడెంట్), కర్ణాటక ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ సురేష్ మరియు సెక్రటరీ హరీష్ మరియు ఆఫీస్ బేరర్స్ ను కలిసి తెలుగు సినీ ఇండస్ట్రీ తరఫున ఆహ్వానించిన తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ హానరబుల్ సెక్రటరీ శ్రీ దామోదర్ ప్రసాద్ గారు మరియు సీనియర్ ప్రొడ్యూసర్ సి. కళ్యాణ్ గారు.