మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 25 డిశెంబరు 2016 (17:24 IST)

'దంగల్' దరి చేరని కరెన్సీ కష్టాలు.. 2 రోజుల్లో రూ.64.60 కోట్ల కలెక్షన్లు

దేశవ్యాప్తంగా నెలకొన్న కరెన్సీ కష్టాలు ఆమీర్ ఖాన్ నటించిన 'దంగల్‌' చిత్రం దరిచేరలేదు. కరెన్సీ కష్టాల సమయంలో కూడా రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబట్టింది. కేవలం రెండు రోజుల్లో రూ.64.60 కోట్ల మేరకు కలెక్ష

దేశవ్యాప్తంగా నెలకొన్న కరెన్సీ కష్టాలు ఆమీర్ ఖాన్ నటించిన 'దంగల్‌' చిత్రం దరిచేరలేదు. కరెన్సీ కష్టాల సమయంలో కూడా రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబట్టింది. కేవలం రెండు రోజుల్లో రూ.64.60 కోట్ల మేరకు కలెక్షన్లు రాబట్టింది. నోట్ల కోసం జనం పాట్లు పడుతున్న సమయంలో కూడా ఆమీర్ ఖాన్ సినిమాకు ఈ స్థాయి కలెక్షన్స్ రావడంతో బాలీవుడ్ ప్రముఖులు ఆశ్చర్యపోతున్నారు. పైగా 'దంగల్' సినిమాకు ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా రాకపోవడం వల్లే ఇది సాధ్యమైందని సినీ విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు. 
 
ప్రముఖ ఇండియన్ రెజ్లర్ మహవీర్ సింగ్ పొగట్ జీవిత కథ ఆధారంగాఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి విశేష స్పందనను అందుకుంది. ఈ చిత్రంలో ఆమీర్ ఖాన్ నటన, కూతురి పాత్రలు పోషించిన ఫాతిమా, సాన్యా మల్హోత్ర నటనకు జనం నీరాజనం పట్టారు. 
 
అయితే సల్మాన్ ఖాన్ నటించిన 'సుల్తాన్' సినిమా వన్ డే కలెక్షన్స్‌ను 'దంగల్' బీట్ చేయలేకపోయింది. సుల్తాన్ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ రూ.36 కోట్లు. దంగల్ మాత్రం రూ.30 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అయితే, సుల్తాన్ విడుదలైప్పటి పరిస్థితి వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరు. ఆమీర్ ఖాన్ సినిమాల్లో 'పీకే' మొదటి రోజు రూ.25 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా కలెక్షన్స్‌ను దంగల్ దాటేసింది.