బుధవారం, 19 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 మార్చి 2025 (14:17 IST)

దసరాకు సీజన్‌లో విడుదలయ్యే తెలుగు చిత్రాలేంటి?

akhanda-2
ఈ యేడాది సంక్రాంతి సీజన్ ముగిసిపోయింది. 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ ఘన విజయం సాధించింది. ఇక ప్రతి ఒక్కరూ దసరా సీజన్‌పై దృష్టిసారించారు. ఈ క్రమంలో ఈ యేడాది సంక్రాంతి సీజన్‌కు పలు తెలుగు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో సెప్టెంబరు 25వ తేదీన నందమూరి బాలకృష్ణ నటించిన "అఖండ-2" ముందువరుసలో ఉంది. అందుకు తగినట్టుగానే ఆ చిత్ర చిత్రీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. హిమాలయ పర్వత ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆ తర్వాత కర్నూలులో ఈ సినిమా షూటింగ్‌ను ప్లాన్ చేశారు. ఇందుకోసం అక్కడ ఓ భారీ సెట్‌ను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. 
 
మరోవైపు, సాయి ధరమే తేజ్ తన కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న "సంబరాల ఏటిగట్టు" సినిమా కూడా సెప్టెంబరు 25వ తేదీన విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టు నిర్మాతల చెబుతున్నారు. ఇకపోతే భారీ అంచనాలు ఉన్న పవన్ కళ్యాణ్ "ఓజీ" చిత్రం కూడా దసరా రేసులో నిలిచేలా ఉంది. కానీ, ఈ చిత్రం చిత్రీకరణ ఇంకా చేయాల్సివుంది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇచ్చే తేదీలను బట్టి అది పూర్తిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మరోవారం రోజుల్లో పాన్ ఇండియా మూవీ 'కాంతార-2'ను విడుదల చేయనున్నారు. 
 
సెప్టెంబరు 29 నుంచి దసరా సెలవులతో పాటు అక్టోబరు 2వ తేదీన దసరా పండుగ కావడంతో లాంగ్ వీకెండ్‌కు అవకాశం ఉంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు నిర్మాతలు తమతమ చిత్రాలను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే, చివరకు ఏ చిత్రం దసరా సీజన్‌లో నిలుస్తుందో వేచి చూడాల్సివుంది.