గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 8 జనవరి 2025 (18:48 IST)

తాతయ్య బాలయ్యకు ఇంకా ఇలాంటి సీన్లు, డ్యాన్సులు అవసరమా?

Balayya DabidiDibidi
ప్రస్తుతం సోషల్ మీడియాలో నట సింహం బాలయ్యపై ట్రోల్స్ పడుతున్నాయి. డాకుమహరాజ్ చిత్రంలో దబిడి దిబిడి ఐటమ్ సాంగ్ డ్యాన్సులో బాలయ్యపై ట్రోల్ చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యేగానూ, ముఖ్యమంత్రికి వియ్యంకుడిగానూ, ఒక మంత్రికి మావయ్య అయిన బాలయ్య ఇప్పటికే తాతయ్య కూడా అయ్యారు. ఈ పరిస్థితుల్లో ఆయన కుర్ర హీరోయిన్లతో ఇలాంటి ఐటెం సాంగులు, డ్యాన్సులు అవసరమా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. మరి బాలయ్య ఇలాంటి వాటి విషయంలో ఏమయినా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారేమో చూడాలి.
 
నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి 'డాకు మహారాజ్'తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 'డాకు మహారాజ్' చిత్రం సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.
 
తారాగణం: నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా, సంగీతం: తమన్ ఎస్, ఛాయాగ్రహణం: విజయ్ కార్తీక్, కళా దర్శకుడు: అవినాష్ కొల్లా, కూర్పు: నిరంజన్ దేవరమానే, రూబెన్, దర్శకత్వం: బాబీ కొల్లి, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య, బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌, సమర్పణ: శ్రీకర స్టూడియోస్.