సంబంధిత వార్తలు
- టాలెంట్ ఉంటే ఫలితం లేదు... బిహేవియర్ ముఖ్యం .. చిరంజీవి డైరెక్ట్ పంచ్ (Video)
- ఛాన్స్ వస్తే అకిరా నందన్‌తో ఖుషి 2 ప్లాన్ చేస్తా
- ఇండస్ట్రీలో టాలెంట్‌తో పాటు, ప్రవర్తన కూడా ఉండాలి.. పరిస్థితులను అనుకూలంగా ఎదిగా: మెగాస్టార్ చిరంజీవి
- పవన్ కళ్యాణ్ వున్నా, రామ్ చరణ్ వున్నా మూలాలు చిరంజీవిగారే: పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్
- ఒలింపిక్ విజేత దీప్తి జీవాంజికి చిరంజీవిగారు చెక్ ఇవ్వడం సంతోషాన్నిచ్చింది
రామోజీరావు ప్రశ్నకు రాజేంద్రప్రసాద్ బాధపడ్డాడు
Ramoji, Rajedra
కామెడీకి కేరాఫ్ అడ్రెస్ గా రాజేంద్రప్రసాద్ నిలుస్తాడు. అలాంటి నటుడు సినిమా నేను ఎక్కువగా చూస్తుంటాననీ, రాజకీయాల్లో కాస్త రిలాక్స్ ఆయన సినిమాలేనని స్వర్గీయ పి.వి.నరసింహారావు చెప్పారు కూడా. అలాగే దివంగత రామోజీరావు కూడా ఓ సందర్భంలో రాజేంద్రప్రసాద్ ను కలిసి, చూడు రాజేంద్ర.. నీకు పద్మ అవార్డు వచ్చిందా? అంటూ అడిగాడు. నేను తలవంచుకుని లేదండి అని చెప్పారు..సరే.. అంతకంటే పెద్ద అవార్డు ప్రజలిచ్చారు అదిచాలు నీకు అంటూ భుజం తట్టారు అంటూ ఆనందభరితంగా చెప్పారు.
ఇక పద్మ అవార్డులు ఈమధ్య చాలామందికి వస్తున్నాయి. నాయికలు కూడా వస్తున్నాయి? అనే ప్రశ్నకు రాజేంద్రప్రసాద్ సమాధానమిస్తూ,, వారిలో వున్న టాలెంట్ నాకు లేదు కాబోలు అంటూ చలోక్తి విసిరారు. ఏ అవార్డులకైనా ఓ కమిటీ వుంటుంది. ఆ కమిటీ ద్రుష్టిలో నేను పడలేదు. అసలు అవార్డుకోసం అప్లయి చేయాలని ఆలోచన కూడా తనకు లేదని తేల్చిచెప్పారు.
