సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 4 జనవరి 2025 (17:23 IST)

ఒలింపిక్ విజేత దీప్తి జీవాంజికి చిరంజీవిగారు చెక్ ఇవ్వడం సంతోషాన్నిచ్చింది

Pullela Gopichand, Chiranjeevi
Pullela Gopichand, Chiranjeevi
ఇటీవ‌ల మ‌న తెలుగు రాష్ట్రాల నుంచి పారా అథ్లెట్ ఒలింపిక్స్‌లో మెడ‌ల్ సాధించిన వ్య‌క్తి దీప్తి జీవాంజి. వ‌రంగ‌ల్‌లోని ఓ చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన ఆమె దేశానికెంతో పేరుని తెచ్చారు. ఒలింపిక్స్‌లో మెడ‌ల్ సాధించిన సంద‌ర్భంగా మీకేం కావాల‌ని నేను ఆమెను అడిగిన‌ప్పుడు, చిరంజీవిగారిని క‌ల‌వాల‌నుంద‌ని చెప్పారు.

Pullela Gopichand, Chiranjeevi, Deepti Jeevanji
Pullela Gopichand, Chiranjeevi, Deepti Jeevanji
ఇటీవ‌ల నేను చిరంజీవిగారిని ఓ సంద‌ర్భంలో క‌లిసిన‌ప్పుడు దీప్తి జ‌వాంజి గురించి చెప్పాను. ఆయ‌న చాలా గొప్ప మ‌న‌సుతో స్పందించారు. చాలా పెద్ద అచీవ్‌మెంట్ చేసిన‌ప్పుడు, ఆమె రావ‌టం కాదు, నేను అకాడ‌మీకి వ‌స్తాన‌ని అన్నారు. 
 
అన్న‌ట్లుగానే చిరంజీవిగారు మా అకాడ‌మీకి వ‌చ్చి, అక్క‌డున్న పిల్ల‌లంద‌రినీ క‌లిశారు. రెండు గంట‌ల పాటు అక్క‌డే గ‌డిపారు. అలాగే ప్ర‌తీ ఒక్క ప్లేయ‌ర్‌ని ఇన్‌స్పైర్ చేసే విధంగా మాట్లాడారు. ఇదే సంద‌ర్భంలో ఆయ‌న మూడు ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్‌ను దీప్తికి అందించటం అనేది మాకెంతో సంతోషాన్నిచ్చింది. ఇది మా స్పోర్ట్స్ ప‌ర్స‌న్స్‌కి చిరంజీవిగారు ఇచ్చిన గొప్ప గౌర‌వంగా నేను భావిస్తాను. ఈ ఇన్‌స్పిరేష‌న్‌తో చాలా మంది మ‌రిన్ని ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహిస్తార‌ని నేను భావిస్తున్నాను అని  పుల్లెల గోపీచంద్‌ అన్నారు.