బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (12:13 IST)

‘డియర్ కామ్రేడ్’కు గుమ్మడికాయ కొట్టేశారు..

‘ఫైట్‌ ఫర్‌ వాట్‌ యు లవ్‌’ అనే ట్యాగ్ లైన్‌తో 'గీత గోవిందం'తో హిట్ సాధించేసిన విజయ్ దేవరకొండ, రష్మికలు జంటగా తెరకెక్కుతోన్న తదుపరి సినిమా ‘డియర్ కామ్రేడ్’. . ‘గీతగోవిందం’ వంటి హిట్‌ చిత్రం తర్వాత ఈ జంట నటిస్తున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కాలేజీ రాజకీయాలు, ప్రేమ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి తొలిసారిగా మైక్ పట్టుకున్న భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నారు. 
 
ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానున్న ఈ సినిమా... తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల చేయబడుతోంది. సుమారు ఏడాది క్రితం ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఎట్టకేలకు పూర్తయింది. 
 
ఈ మేరకు దర్శకుడు భరత్ కమ్మ ట్విట్టర్ ద్వారా... ‘ప్యాకప్!! డియర్ కామ్రేడ్ షూటింగ్ పూర్తయింది! సుమారు ఏడాదిపాటు షూటింగ్‌ను చాలా గొప్పగా చేసాము. అందరినీ మిస్సవుతున్నా’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా, విజయ్ దేవరకొండ, రష్మిక, ఇతర టీమ్ సభ్యులతో కూడిన ఫొటోను కూడా షేర్ చేసారు. 
 
కాగా, ఇప్పటికే విడులైన ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. టీజర్‌లో విజయ్, రష్మిక లిప్‌లాక్ మరింత హీట్ పెంచింది. అలాగే, ‘నీలి నీలి కన్నుల్లోన’ సాంగ్ కూడా విశేషంగా ఆకట్టుకుంది. విజయ్ అభిమానులు ఈ సినిమా ఎప్పుడొప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాని మే నెల 31న విడుదల చేయనున్నట్లు మొదట ప్రకటించారు. కానీ, ఆ తేదీకి సినిమా విడుదలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. మరి ఈ జంట ఈసారి ఇంకెన్ని సంచలనాలు సృష్టించనుందో వేచి చూడాల్సిందే.