శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 సెప్టెంబరు 2024 (09:08 IST)

మీ అందరూ గర్వపడేలా కష్టపడతా : నటి జాన్వీ క‌పూర్

Jhanvi Kapoor
తెలుగు ప్రేక్షకులంతా గర్వపడేలా కష్టపడతా అని సినీ నటి జాన్వీ కపూర్ అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం "దేవర". కొరటాల శివ దర్శకుడు. ఈ నెల 27వ తేదీన విడుదలకానుంది. పాన్ ఇండియా మూవీగా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అందాల నటి దివంగత శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం రాత్రి హైదరాబాద్ నగరంలో జరగాల్సివుంది. కానీ, ఎన్టీఆర్ అభిమానుల అత్యుత్సాహం, ఓవరాక్షన్ వల్ల ఈ కార్యక్రమాన్ని రద్దు చేశారు. 
 
దీంతో ఆ చిత్ర హీరోయిన్ జాన్వీ కపూర్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇందులో.. మీరందరూ గర్వపడేలా శ్రమిస్తానని తెలిపారు. తనను ఇంతగా అభిమానిస్తున్న తెలుగు ఆడియన్స్‌కు, తనను జాను పాప అని పిలుస్తున్న తారక్ ఫ్యాన్స్‌కు ధన్యవాదాలన్నారు. మా అమ్మకు మీరు ఎంత ముఖ్యమో.... నాకూ మీరు అంతే ముఖ్యమన్నారు. 'దేవర' తనకు తొలి అడుగు, తనను ఎలాగైతే ఆదరిస్తున్నారో 'దేవర' చిత్రాన్ని కూడా అలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈ సినిమాలో తనను ఎంచుకోవడం తన అదృష్టంంగా భావిస్తున్నట్టు జాన్వీ కపూర్ విడుదల చేసిన వీడియో సందేశంలో పేర్కొన్నారు.