శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 సెప్టెంబరు 2024 (09:34 IST)

'దేవర' సెన్సార్ పూర్తి.. సినిమా నిడివి 2 గంటల 57 నిమిషాల 58 సెకన్లు!!

devara movie
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "దేవర". ఈ చిత్రం ఈ నెల 27వ తేదీన విడుదలకానుంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను తాజాగా  పూర్తి చేసుకుంది. ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు 'దేవర' చిత్రానికి యూఏ సర్టిఫికేట్‌కు మంజూరు చేసింది. సినిమా నిడివి కూడా 2 గంటల 57 నిమిషాల 58 సెకన్లుగా ఉంది. 
 
'జనతా గ్యారేజ్' మూవీ తర్వాత ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో అందరిలోనూ భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాతో శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ టాలీవుడ్లో అడుగుపెడుతుండగా, సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపించనున్నాడు. 
 
సినిమాలో చివరి 40 నిమిషాలు అద్భుతంగా ఉంటుందని, మూవీకి అదే హైలైట్ అని ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా విడుదలకు ముందే అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
 
కాగా, ఉత్తర అమెరికాలో అత్యంత వేగంగా టికెట్ల ప్రీ సేల్ ద్వారానే వన్ మిలియన్ డాలర్ల మార్కును చేరుకున్న సినిమాగా 'దేవర' రికార్డులకెక్కింది. ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందే ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ మూవీగా దేవర రికార్డులకెక్కింది.