ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 సెప్టెంబరు 2024 (12:03 IST)

'దేవర' ట్రైలర్ హీరో ఎన్టీఆర్‌ను నిరుత్సాహపరిచిందా?

devara trailer
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్రం దేవర - పార్ట్1. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఎందుకంటే కొరటాల, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్‌లుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో దేవర చిత్రం ట్రైలర్‌ను సోమవారం ముంబైలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై  అంచనాలు రెట్టింపు అవుతాయని భావించారు. కానీ, ట్రైలర్‌ చూశాక జూ ఎన్టీఆర్‌ హార్ట్ కోర్ అభిమానులు సైతం పెదవి విరుస్తున్నారు. 
 
ముందు నుంచి హైప్ ఇచ్చినంత కంటెంట్ ట్రైలర్లో ఏమాత్రం కనిపించడం లేదని వారు అంటున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ లుక్ మొదలుకొని, ట్రైలర్‌ను కట్ చేసిన విధా‌నం పాన్ ఇండియా సినిమా స్దాయికి పూర్తి విరుద్దంగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మోస్ట్ వయోలెంట్ మూవీ అని ప్రచారం చేసిన టీమ్, ఎన్టీఆర్ పాత్రను అంత క్రూరంగా ఎక్కడా చూపించలేదనీ, అసలు ఆ వయోలెంట్ రోల్‌కు ఎన్టీఆర్ సూట్ అయినట్లు కనిపించింది కూడా లేదనే పోస్టులు పెడుతున్నారు. 
 
దీనికితోడు ముంబై ట్రైలర్ లాంఛ్‌లో ఎన్టీఆర్ తనకు దేవర విషయంలో దడగా ఉందని, ఆరేళ్ల అనంతరం సోలో హీరోగా చేస్తున్న సినిమా కావటంతో దేవర ఫలితంపై ఆసక్తి వెయిట్ చెస్తున్నానంటూ మాట్లాడటం అభిమానులకు మరింత ఆందోళనను కలిగిస్తుందని వారు పేర్కొంటున్నారు. అయితే దేవర సినిమా లాస్ట్ 40 నిమిషాలు బాగుంటుందంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం‌ చేసినప్పటికీ ట్రైలర్‌లో అదేమి కనిపించింది లేదన్నది ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాటగా ఉంది. మొత్తంగా ఎన్టీఆర్‌ స్పీచ్‌ను విన్నవారందరు.. తారక్ ఏంటి ఇంత డౌట్ ఫుల్‌గా మాట్లాడుతున్నారు, దేవర ఫలితంపై ఆయనకు అనుమానమా అనే కామెంట్స్ చేస్తున్నారు.