గురువారం, 7 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (18:17 IST)

ఎన్టీఆర్‌, సైఫ్ మ‌ధ్య ఉన్న స‌న్నివేశాలే నెక్ట్స్ లెవ‌ల్‌గా దేవర థియేట్రికల్ ట్రైలర్

Saif, ntr
Saif, ntr
మ్యాన్ ఆఫ్ మాసెస్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. అభిమానులు స‌హా అంద‌రూ ఎంతో ఆతృత‌గా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై  మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సినిమాటోగ్రాఫర్ ఆర్‌.ర‌త్న‌వేలు, ఎడిట‌ర్ శ్రీక‌ర్ ప్ర‌సాద్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ సాబు శిరిల్ వంటి స్టార్ టెక్నీషియ‌న్స్ ఈ చిత్రానికి వ‌ర్క్ చేస్తున్నారు. జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టించారు.
 
ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా నుంచి విడుద‌లైన మూడు సాంగ్స్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం మేక‌ర్స్ ‘దేవర’ మూవీని థియేట్రికల్ ట్రైలర్‌ను ముంబైలో ఘ‌నంగా నిర్వ‌హించారు. నిర్మాత క‌ర‌ణ్ జోహార్‌, అనిల్ త‌డాని స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు వేడుక‌కు హాజ‌ర‌య్యారు. 2 నిమిషాల 35 సెక‌న్లున్న ఈ ట్రైల‌ర్  మాస్ ఎలిమెంట్స్ ప్యాక్డ్‌గా ఉంది. ఎన్టీఆర్ అభిమానుల‌కు, యాక్ష‌న్ మూవీ ల‌వ‌ర్స్ కోరుకునే అంశాల‌తో నిండి ఉంది. ఈ మూవీ కోసం ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ క్రియేట్ చేసిన ప్ర‌త్యేక‌మైన ప్ర‌పంచం, ఆయ‌న విజ‌న్ అద్భుతంగా ఉన్నాయి. 
 
ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే ప్ర‌కాష్ రాజ్ గంభీర‌మైన వాయిస్ ఓవ‌ర్‌తో ప్రారంభ‌మైంది. తీర‌ప్రాంతంలో ఎలాంటి భ‌యాలు లేని ప్ర‌జ‌లు నివ‌సిస్తుంటారు. అక్క‌డ ఉండే భైరా (సైఫ్ అలీఖాన్‌) ఓ క్రూర‌మైన గ్యాంగ్‌తో ఆకృత్యాల‌కు పాల్ప‌డుతుంటాడు. ఆ ముఠా అక్క‌డ‌కొచ్చే ఓడ‌ల‌ను దోచుకోవ‌ట‌మే కాకుండా, కోస్ట్ గార్డుల‌ను కూడా చంపేస్తూ ర‌క్త‌పాతాన్ని సృష్టిస్తుంటారు. ఇలాంటి కొంత మంది కరుడుగట్టిన గ్రామ‌స్థుల‌కు భ‌యాన్ని ప‌రిచయం చేస్తాడు ‘దేవర’ (ఎన్టీఆర్‌) . ఆ గ్రామాన్ని పెను ప్ర‌మాదం నుంచి ర‌క్షించే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో ఎన్టీఆర్ పాత్ర మ‌న‌కు ప‌రిచ‌యం అవుతుంది.
 
ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజ‌న్స్‌, అద్భుత‌మైన డైలాగ్ డెలివ‌రీ, ఆశ్చ‌ర్య‌ప‌రిచే ఎలివేష‌న్ స‌న్నివేశాల‌ల‌తో ఉన్న ఈ ట్రైల‌ర్ అంద‌రిలో సినిమాపై ఉన్న అంచనాల‌ను మ‌రింత‌గా పెంచుతోంది. ఎన్టీఆర్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు. భ‌యానికి అర్థం చెప్పే ప్ర‌తిరూప‌మైన పాత్ర ఒక‌టైతే.. భ‌య‌ప‌డుతూ ఉండే మ‌రో పాత్ర‌లో ఎన్టీఆర్ క‌నిపించ‌నున్నారు. భైరా అనే అనే భ‌యంక‌ర‌మైన పాత్ర‌లో సైఫ్ అలీఖాన్ క‌నిపించారు. ఎన్టీఆర్‌, సైఫ్ మ‌ధ్య ఉన్న స‌న్నివేశాల‌ను చూస్తుంటే సినిమా నెక్ట్స్ లెవ‌ల్ అనేంత‌గా అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్ర‌కాష్ రాజ్‌, శ్రీకాంత్‌, అజ‌య్, గెట‌ప్ శీను త‌దిత‌రులను మ‌నం ట్రైల‌ర్‌లో చూడొచ్చు.
 
జాన్వీక‌పూర్ ఇందులో తంగం అనే ప‌ల్లెటూరి అమ్మాయి పాత్ర‌లో క‌నిపించింది. ఆమె లుక్స్ చూప‌రుల‌ను ఇట్టే ఆక‌ట్టుకుంటున్నాయి. ఎన్టీఆర్‌, జాన్వీ మ‌ధ్య ఉన్నచ‌క్క‌టి కెమిస్ట్రీతో స‌న్నివేశాలు ఆక‌ట్టుకునేలా ఉన్నాయ‌నిపిస్తుంది. అనిరుద్ ర‌విచంద‌ర్ అద్భుత‌మైన సంగీతంతో పాటు యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు ఆయ‌న అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ వింటుంటే అంచ‌నాలు ఆకాశాన్నంటుతున్నాయి. గూజ్‌బ‌మ్స్ వ‌స్తున్నాయి. ట్రైల‌ర్‌లో కొన్ని సీన్స్ అయితే క‌ళ్ల‌కువిందుగా ఉన్నాయి. ట్రైల‌ర్ చివ‌ర‌లో ఎన్టీఆర్ షార్క్‌పై ఉండి రైడ్ చేసే సీన్ నెక్ట్స్ రేంజ్‌లో ఉంది.  
 
గ్రాండ్ లెవ‌ల్లో దేవ‌ర చిత్రాన్ని అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. ప్ర‌తి సీన్ వావ్ అనిపిస్తుంది. ట్రైల‌ర్‌లో ఆక‌ర్ష‌ణీయంగా అనిపిస్తోన్న ఈ స‌న్నివేశాలు సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆస‌క్తిని అంద‌రిలోనూ క్రియేట్ చేస్తోంది. దేవ‌ర ప్ర‌పంచాన్ని ఈ ట్రైల‌ర్ ప‌రిచ‌యం చేసిన తీరు ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 27న  దేవ‌ర చిత్రం తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌లయాళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.