బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 సెప్టెంబరు 2024 (09:16 IST)

'దేవర' మరో 'ఆచార్య' అంటూ ట్రోలింగ్.. ఆందోళనలో ఎన్టీఆర్?

devara movie
కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న చిత్రం దేవర. ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం సూపర్ హిట్ అయింది. దీంతో దేవరపై ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ చిత్రం ట్రైలర్ చూసిన తర్వాత మరో ఆచార్య అంటూ ట్రోలింగ్ వస్తున్నాయి. ఇది హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు ఎక్కడలేని టెన్షన్ పుట్టిస్తుంది. పైగా, ఆయన అభిమానులు సైతం ఈ ట్రైలర్‌ను చూసి తీవ్ర నిరుత్సాహానికి లోనైట్టు ప్రచారంసాగుతుంది. 
 
'ఆచార్య' సినిమా అనంతరం దర్శకుడు కొరటాల శివ అల్లు అర్జున్‌తో ఓ సినిమా చెయాల్సి ఉంది. ఆ సినిమాను తొలుత ఎనౌన్స్ చేసారు కూడా. అయితే అనూహ్యంగా ఆ సినిమా క్యాన్సిల్ అవటం..‌ సడెన్‌గా ఎన్టీఆర్ తో కొరటాల శివ సినిమా ఫిక్స్ అవటం జరిగిపోయింది. "ఆచార్య" సినిమా ఫలితం, దాని తదనంతరం చిరంజీవి చేసిన కొన్ని కామెంట్స్.. ‌కొరటాల ఇమేజ్‌ను కంప్లీట్‌గా దెబ్బతీసిన పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలో కొరటాల శివ తానెంటో మరలా నిరూపించుకోవాల్సినస్థితి ఏర్పడింది.
 
ఎన్టీఆర్ కొరటాల శివపై నమ్మకంతో 'దేవర' చేసే అవకాశం ఇచ్చినపుడు.. అభిమానుల నుంచి రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. గత ఏడాది కాలంగా 'దేవర' సినిమా చిత్రీకరణ జరగటం.. ఈ సినిమా ఓపెనింగ్ మొదలు.. కాస్టింగ్ సెలెక్షన్.. రెండు భాగాలుగా సినిమాను ప్రకటించటం.. ఇలా నిదానంగా 'దేవర'పై హైప్ క్రియేట్ అయిందనుకున్న క్రమంలో ట్రైలర్ రిలీజ్ అయి 'దేవర'పై ఉన్న పాజిటివ్ బజ్‌ను కాస్త డిస్ట్రబ్ చేసినట్లు కన్పిస్తోంది.
 
'దేవర' ట్రైలర్ను చూసిన సినీ అభిమానులు..‌ కొరటాల శివ, కేజీఎఫ్ పార్మాట్‌లో ఈ సినిమా తీద్దామనుకున్నాడు.. కానీ అది 'ఆచార్య'లానే అయిందనిపిస్తూందంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. గతంలో 'ఆచార్య' సినిమాలోని సన్నివేశాలను, 'దేవర' ట్రైలర్‌లోని సన్నివేశాలను కంపేర్ చేస్తూ మరీ ట్రోలింగ్ చెస్తూ ఉన్నారు. "ఆర్ఆర్ఆర్"లో రాజమౌళి, ఎన్టీఆర్  ప్రతిభను తగ్గ పాత్రను డిజైన్ చేసి వరల్డ్ వైడ్ రీచ్ వచ్చేలా చేశారని.. కొరటాల మాత్రం రెగ్యులర్ కమర్షియల్ సినిమా తరహాలోనే 'దేవర' సినిమాను, ఎన్టీఆర్‌ పాత్రను డిజైన్ చేయటం బాలేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ అవుతున్నాయి.
 
'దేవర' ట్రైలర్ చూశాక, నిర్మాణ విలువలు భారీగా ఉన్నా.. కంటెంట్ ఏమాత్రం ఆసక్తికరంగా లేదని.. ఎన్టీఆర్‌ కొరటాలకు ఛాన్స్ ఇచ్చి తప్పు చేశాడా అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ అభిమానులు.. 'దేవర' సబ్జెక్టును వదులుకుని తమ హీరో సేఫ్ అయ్యాడంటూ రిప్లై ఇస్తున్నారు. ఇక రాజమౌళితో సినిమా చేసిన ఏ హీరోకైనా నెక్ట్స్ మూవీ ప్లాప్ అనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉన్న తరుణంలో..‌ కొరటాల శివ దాన్ని బ్రేక్ చేసి ఎన్టీఆర్‌కు హిట్ ఇచ్చి.. తాను కంబ్యాక్ ఇస్తాడని ఆశించిన వారందరు దేవర ట్రైలర్‌లో వయలెన్స్ చూసి సైలెన్స్ అయ్యరంటూ ట్రోలింగ్ జరుగుతోంది.