మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 11 జూన్ 2018 (16:38 IST)

'ధడక్' మూవీ ట్రైలర్ రిలీజ్... జాన్వీ నటన అదుర్స్...

వెండితెర అతిలోక సుందరి దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ను వెండితెరకు పరిచయం చేస్తూ తెరకెక్కిన చిత్రం "ధడక్". ఇషాన్ హీరోగా నటించగా, ధర్మ మూవీస్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమాకి శశాంక్ ఖైతాన్ దర్శ

వెండితెర అతిలోక సుందరి దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ను వెండితెరకు పరిచయం చేస్తూ తెరకెక్కిన చిత్రం "ధడక్". ఇషాన్ హీరోగా నటించగా, ధర్మ మూవీస్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమాకి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించాడు. టీనేజ్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రం ఈనెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది.
 
సరదాగా సాగిపోయే సందడికి సంబంధించిన సన్నివేశాలపై.. సున్నితమైన భావోద్వేగాలపై ట్రైలర్ కట్ చేశారు. మొత్తం మీద యూత్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ సినిమా, నేటి యువతకు బాగా కనెక్ట్ అయ్యేలా తీసినట్టుగా తెలుస్తోంది. జాన్వీకి ఇది తొలి సినిమా అయినప్పటికే.. ఆమె నటనలో ఎక్కడా తడబాటు కనిపించకపోవడం విశేషం.
 
ఈ చిత్రం మరాఠీలో బ్లాక్‌బస్టర్ అయిన సైరత్‌కు రీమేక్. కేవలం 4 కోట్ల రూపాయల వ్యయంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించగా బాక్సాఫీసు రికార్డులు బ్రేక్‌ చేస్తూ రూ.90 కోట్ల వరకు వసూలు చేసిన విషయం తెల్సిందే. దీంతో ధడక్‌పై భారీ అంచనాలు నెలకొనివున్నాయి.