మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (13:14 IST)

'భీమ్లా నాయక్‌'లో గర్జించే సింహాన్ని చూశా : హరీష్ శంకర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కొత్త చిత్రం "భీమ్లా నాయక్". శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. దగ్గుబాటి రానా విలన్. నిత్యా మీనన్, సంయుక్తా మీనన్‌లు హీరోయిన్లు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చారు. 
 
శుక్రవారం విడుదలైన ఈ చిత్రం తొలి ఆటతోనే హిట్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని చూసిన దర్శకుడు హరీష్ శంకర్ తన అభిప్రాయాన్ని ట్విట్టర్‌లో వెల్లడించారు. సినిమా అదిరిపోయిందన్నారు. 
 
"కొంచెం గ్యాప్ తర్వాత గర్జించే పవన్ కళ్యాణ్‌ను చూశానని అన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, దర్శకుడు సాగర్ పనితీరు అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. తమన కెరీర్‌లోనే ది బెస్ట్ సంగీతం అందించారన్నారు. 
 
ఆయన సంగీతం 'భీమ్లా నాయక్‌'కు బ్యాక్ బోన్ అని చెప్పారు. అలాగే, ఈ చిత్రంలో రానాను చూడలేదని డేనియల్ శేఖర్‌ని మాత్రమే చూశానని చెప్పారు. అలాగే, పవన్ కళ్యాణ్ గురించి స్పందిస్తూ, కొంచెం గ్యాప్ తర్వాత గర్జించే సింహాన్ని చూశానని చెప్పారు.