శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , సోమవారం, 31 జులై 2017 (06:06 IST)

అన్నా అన్నా అన్న కల్పన.. తెగ ఫీలై అలా అనొద్దన్న బిగ్ బాస్

ఎన్టీఆర్‌ హోస్ట్‌ చేస్తున్న బిగ్‌బాస్‌ షో సక్సెస్‌ ఫుల్‌ రన్‌ అవుతోంది. తొలి వారం సాదా సీదాగా సాగిన వారంతంలో ఎన్టీఆర్‌ రావడంతో ఈ రియాలిటీ షో జోరందుకుంది. 14 మంది కంటెస్టెంట్‌లతో ప్రారంభమైన బిగ్‌బాస్‌.

ఎన్టీఆర్‌ హోస్ట్‌ చేస్తున్న బిగ్‌బాస్‌ షో సక్సెస్‌ ఫుల్‌ రన్‌ అవుతోంది. తొలి వారం సాదా సీదాగా సాగిన వారంతంలో ఎన్టీఆర్‌ రావడంతో ఈ రియాలిటీ షో జోరందుకుంది. 14 మంది కంటెస్టెంట్‌లతో ప్రారంభమైన బిగ్‌బాస్‌.. నటి జ్యోతి ఎలిమెనేట్‌ అవ్వగా.. హీరో బర్నింగ్‌ స్టార్‌ సంపూ అర్ధాంతరంగా తప్పుకున్న విషయం తెలిసిందే.

శనివారం బిగ్‌బాస్‌ హౌజ్‌ మెంబర్స్‌తో ముచ్చటించిన ఎన్టీఆర్‌ మహేశ్‌ కత్తితో చికెన్‌ వడ్డించుకొని తన కోరిక తీర్చుకున్నాడు.  ఎప్పుడూ కిచెన్‌ వైపు అడుగుపెట్టని మహేశ్‌ కత్తి ఎన్టీఆర్‌ కోరిక మేరకు గరిటే పట్టడంతో మిగతా హౌస్‌ మెట్స్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఇక మహేశ్‌ కత్తి చికెన్‌ వండుతుండగా హౌస్‌ మెట్స్‌కి  ఎన్టీఆర్‌ ఓ టాస్క్‌ ఇచ్చాడు. 
 
అదేమిటంటే.. కత్తుల సింహాసనంపై హౌస్‌ మెట్స్‌ తాము విలన్‌గా భావించేవారిని కూర్చోబెట్టి దానికి కారణం చెప్పాలి. ఎక్కువ సభ్యులు కెప్టెన్‌ కల్పనానే తమ విలన్‌గా పేర్కొన్నారు. తొలివారం ఆమె ప్రవర్తనకు కెప్టెన్‌ అనంతరం ఆమె ప్రవర్తనకు చాల తేడా ఉందని, వారికి తొలి వారం కల్పనానే కావాలని కోరారు. ఇక శివబాలజీ అయితే కల్పనా బిగ్‌బాస్‌ హౌజ్‌కు పనికి రాదని నిర్మోహమాటంగా చెప్పాడు. 
 
దీనికి వివరణ కోరిన ఎన్టీఆర్‌ను కల్పనా పదేపదే అన్నా అని పిలవడం ఎన్టీఆర్‌ చికాకు తెప్పిచ్చినట్లుందో లేదా వయసులో తన కన్నా పెద్దదనుకున్నాడో ఎమో కానీ ‘అమ్మా నన్ను దయచేసి అన్నా అని పిలవకు అని వేడుకున్నాడు’. దీంతో ఆమె ఇక నుంచి తారక్‌ గారూ అని పిలుస్తా అని తెలిపింది. దీనికి మిగతా హౌస్‌ మెట్స్‌ బయటకి కనిపించకుండా లోలోపల నవ్వుకున్నారు. 
 
ఈ టాస్క్‌లో రెండోస్థానాన్ని సమీర్‌ దక్కించుకున్నాడు. సమీర్‌ పొగడ్తలనే స్వీకరిస్తాడని కత్తి కార్తీక, జంతువుల గేమ్‌ టాస్క్‌లో సిగరెట్‌ రూం పక్కనే ఉన్న బోనులో కావాలనే వేసారని మధుప్రియ, సమీర్‌ ఎవ్వరినైనా లోబరుచుకోగలడు.. అందరూ తన మాట వినేలా చేసుకుంటాడని కత్తి మహేశ్‌లు కారణాలుగా చెప్పుకొచ్చారు. ఇక ఈ వారం మధుప్రియ బిగ్‌ బాస్‌ నుంచి ఎలిమెనేట్‌ కాగా మరో  కొత్త అతిథి రాబోతుంది.