గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 27 ఆగస్టు 2024 (17:08 IST)

ఈసారైనా?! సినిమా నుండి మొదటి పాట ఆడియన్స్‌ ను అలరిస్తోంది

Viplav, Ashwini
Viplav, Ashwini
ఈసారైనా సినిమాలోని మొదటి పాట?! ఇటీవల విడుదలైంది. యూట్యూబ్ మరియు అన్ని సంగీత ప్లాట్‌ఫారమ్‌లలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. రాకేందు మౌళి రాసిన మనోహరమైన సాహిత్యం మరియు అర్జున్ విజయ్ యొక్క  అద్భుతమైన గానంతో, ఈ ట్రాక్  యువత నోట ప్రతిధ్వనిస్తోంది.
 
విప్లవ్ దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రను పోషించాడు. "ఈసారైనా" సినిమా ఒక అందమైన గ్రామీణ నేపధ్యంలో నిరుద్యోగ యువకుడు ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతూ అదేవిధంగా అతని ప్రేమను వెతుక్కునే దిశగా సాగుతుంది. ఈ చిత్రానికి తేజ్ కథలోని ఎమోషన్ ని పండించేలా అద్భుతమైన సంగీతం అందించారు. సంకీర్త్ కొండ సహ-నిర్మాత  గా అశ్విని అయలూరు ప్రధాన నటిగా నటించారు. ఈ చిత్రం ఈ జనరేషన్ కి తగినట్టుగ అన్ని ఎమోషన్స్ ను అందించే ఒక ప్రామిసింగ్ సినిమా.
 
ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది. జనాలను ఆకట్టుకునే టైటిల్‌తో "ఈసారైనా" ఇటీవలి కాలంలో ఎంతగానో ఎదురుచూస్తున్న చిన్న చిత్రంగా దూసుకుపోతోంది.
 నటీనటులు : విప్లవ్, అశ్విని, ప్రదీప్ రాపర్తి, మహబూబ్ బాషా, కార్తికేయ దేవ్, నీతు క్వీన్, సత్తన్న, అశోక్ మూలవిరాట్