శనివారం, 18 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 17 జనవరి 2025 (14:25 IST)

సైఫ్ అలీఖాన్‌కు కత్తిపోట్లు: ప్రధాన నిందితుడు అరెస్ట్?

Saif Ali Khan case, suspect photo revealed
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పైన జరిగిన కత్తిపోటు కేసు దర్యాప్తు కోసం ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ రంగప్రవేశం చేసారు. సైఫ్ ఇంటి ముందు దయా నాయక్ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దయా నాయక్ కర్ణాటకకు చెందిన సమర్థవంతమైన అధికారి.
 
దయా నాయక్ ఈ కేసును దర్యాప్తు చేయడానికి సైఫ్ నివాసానికి వచ్చారు. దయా నాయక్ ఇతర సిబ్బందితో కలిసి ఇంటి బయట నిలబడి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా, సైఫ్ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఒక అనుమానితుడి ఫోటోను బయటపెట్టారు. ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఫోటోలో వున్న వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్లు సమాచారం వస్తోంది. నిందితుల్లో ఒకరికి ఇంటి పనిమనిషితో పరిచయం ఉందని చెబుతున్నారు.
 
కాగా గురువారం తెల్లవారుజామున ముంబైలోని తన నివాసంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌ను కత్తితో పొడిచిన వ్యక్తి దాడికి ముందు నటుడి ఇంటి సిబ్బందిని కూడా బెదిరించాడు. దాడి చేసిన వ్యక్తి - సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలో కనిపించాడు. కాగా అతడు కోటి రూపాయలు డిమాండ్ చేశాడని ఖాన్ ఇంటి సిబ్బంది తెలిపారు.