గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 జనవరి 2025 (08:54 IST)

శ్రీలీలపై కన్నేసిన బాలీవుడ్ హీరోలు!!

sree leela
తెలుగమ్మాయి, అందాల భామ శ్రీలీలపై బాలీవుడ్ హీరోలు కన్నేశారు. దీంతో తమ చిత్రాల్లో నటించేందుకు ఆమెను బుక్ చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. పుష్ప-2 చిత్రంలో శ్రీలీల ఐటమ్ సాంగ్‌లో నర్తించారు. ఈ పాటకు డ్యాన్స్ ఇరగదీశారు. దీంతో బాలీవుడ్ దర్శక నిర్మాతలు, హీరోల కన్ను ఆమెపై పడింది. ఈ క్రమంలో రెండు బాలీవుడ్ చిత్రాల్లో ఆమెకు అవకాశం దక్కింది. త్వరలోనే మరో చిత్రంలో చేయనున్నట్టు సమాచారం. 
 
ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ మాడాక్‌ ఫిల్మ్స్‌ ఆఫీస్‌లో బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్‌తో శ్రీలీల మీడియాకు కనిపించిందట. దాంతో వీరిద్దరి కాంబినేషన్‌లో త్వరలోనే సినిమా రానున్నదని బీటౌన్‌ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. మాడాక్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కనున్నదని, దర్శకుడు, ఇతర వివరాలు తెలియాల్సివుందని వార్తలు వండేస్తున్నది బాలీవుడ్‌ మీడియా.