ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 డిశెంబరు 2024 (18:41 IST)

Nithiin in Sreeleela Room: శ్రీలీల గదిలో నితిన్ ఏం చేస్తున్నాడు? (video)

Sreeleela
Sreeleela
Nithiin in Sreeleela Room: తెలుగు చిత్ర పరిశ్రమలోని యంగ్ అండ్ డైనమిక్ హీరోయిన్లలో ఒకరు శ్రీలీల. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. శ్రీలీల తాజాగా రాబిన్ హుడ్ చిత్రంలో నటిస్తోంది. ఇప్పటికే ఇండస్ట్రీలోని సీనియర్ హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇలా వరుసగా సినిమాలు, స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఇటీవల హీరో నితిన్‌తో కలిసి ఓ హోటల్ రూమ్‌లో కనిపించింది. ఇద్దరు కలిసి నవ్వుతూ బయటకు వచ్చారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబోయే చిత్రం రాబిన్ హుడ్. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందనను అనుకున్నారు. కానీ పుష్ప 2 డేట్స్ కారణంగా ఆమెకు వీలు కాలేదు. దీంతో ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ శ్రీలీల వచ్చి పడిపోయింది. 
 
ఇటీవలే ఈ చిత్రంలోని ఒక పాట విడుదలై హిట్ అయింది అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో నితిన్ బిజీగా ఉన్న సమయంలో ఓ హోటల్ గదిలో నితిన్‌ని ఆటపట్టించింది శ్రీలీల. 
 
కానీ హోటల్‌లో నితిన్ హీరో రూమ్ అని గుర్తు ఉన్న గదిలోకి వెళ్లి కూర్చున్నాడు. ఆ తర్వాత హీరో అని రాసి ఉన్న చోటే శ్రీ లీల ఎంటర్ అయ్యి హీరోయిన్ అని రాసింది.. నితిన్‌ని ఎందుకు నా రూమ్‌లో ఉన్నావ్ అని అడిగింది.. వెంటనే కంగారు పడ్డాడు నితిన్, నేను మీ రూమ్‌లో ఎందుకు ఉంటున్నాను, నా రూమ్ లోనే ఉన్నాను.
 
ముందు రూం లోంచి బయటకి వచ్చి ఏం రాసిందో చూడు అంది శ్రీలీల. బయటకు రాగానే నితిన్‌కి అంతా అర్థమై హీరో అనే నాలుగు అక్షరాల ముందు "ఇన్" అని ఫ్రాంక్ చేసింది శ్రీలీల. వెంటనే ఆ అక్షరాలను తుడుచుకుని నవ్వుతూ లోపలికి వెళ్లాడు నితిన్. మైత్రీ మూవీ మేకర్స్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది.