మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 26 నవంబరు 2024 (18:17 IST)

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

Nitin and Srileela
Nitin and Srileela
హీరో నితిన్ మచ్-అవైటెడ్ హీస్ట్ కామెడీ రాబిన్‌హుడ్ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీస్ జోరుగా సాగుతున్నాయి. ఈ మూవీకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ రోజు మేకర్స్ ఫస్ట్ సింగిల్- వన్ మోర్ టైమ్‌ని రిలీజ్ చేయడం ద్వారా మ్యూజికల్ ప్రమోషన్‌లను ప్రారంభించారు.
 
ఎలక్ట్రోపాప్ జానర్‌లో హస్కీ ఇంగ్లీష్ కోరస్‌తో సాంగ్ ఓపెన్ అయ్యింది. అకౌస్టిక్, గిటార్ రిఫ్స్  డైనమిక్ బ్లెండ్ తో జి.వి.ప్రకాష్ కుమార్, పాప్ క్వీన్ విద్యా వోక్స్ డిఫరెంట్ స్టయిల్ వోకల్స్ తో అలరించారు. జి.వి.ప్రకాష్  గ్రేస్ ఫుల్ గా పెర్ఫార్మ్ చేయగా, విద్యా వోక్స్ వోకల్స్ తో మెస్మరైజ్ చేశారు.
 
ప్రేమకోసం తన గర్ల్ ఫ్రెండ్ తో మరో అవకాశం కోరే హీరో గురించిన సాంగ్ ఇది. హీరో హానెస్టీ ని మెచుకున్నప్పటికీ, తర్వాత వచ్చే కాన్సెక్యూన్సెస్ కి జాగ్రత్తగా ఉండమని హీరోయిన్ సలహా ఇస్తుంది. అద్భుతమైన, ఎక్సోటిక్ లొకేషన్లలో చిత్రీకరించిన ఈ పాటకు కృష్ణకాంత్ యూత్‌ఫుల్ లిరిక్స్ రాశారు.
 
నితిన్, శ్రీలీల అద్భుతమైన కెమిస్ట్రీ, ఎట్రాక్టివ్ డ్యాన్స్ మూవ్స్ తో ట్రాక్‌ను ఎలివేట్ చేశారు. శేఖర్ మాస్టర్  కొరియోగ్రఫీ ఎనర్జిటిక్ ఫ్లెయిర్‌ని యాడ్ చేసింది. నిస్సందేహంగా, వన్ మోర్ టైమ్ ఆల్టిమేట్ లవ్ ఫ్యూజన్ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది,ఇన్స్టంట్ గా టాప్ చార్ట్స్ లోకి వెళ్ళింది.  
 
నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు. కోటి ఎడిటర్, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్.