శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 27 నవంబరు 2024 (19:54 IST)

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

Robinhood, Nithin, Venky Kudumula, Naveen Yerneni
Robinhood, Nithin, Venky Kudumula, Naveen Yerneni
హీరో నితిన్ మచ్-అవైటెడ్ హీస్ట్ కామెడీ రాబిన్‌హుడ్. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హై బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీస్ జోరుగా జరుగుతున్నాయి. టీజర్, ఫస్ట్ సింగిల్- వన్ మోర్ టైమ్‌ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ డిసెంబర్ 25న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతుంది. ఈ సందర్భంగా టీం ఫస్ట్ కనెక్ట్ ప్రెస్ మీట్ ని నిర్వహించింది.
 
 హీరో నితిన్ మాట్లాడుతూ..   నేను, వెంకీ కలిసి చేస్తున్న సెకండ్ ఫిల్మ్. 'భీష్మ' మ్యాజిక్ ఈ సినిమాతో మళ్లీ రిపీట్ అవుతుందని స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాను. శ్రీలీలతో కూడా ఇది నా సెకండ్ ఫిల్మ్. ఈ సినిమాతో మా పెయిర్ హిట్ పెయిర్ అనిపించుకుంటుందని స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్ కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇంత మంచి సాంగ్స్ ఇచ్చిన జీవి ప్రకాష్ కి థాంక్యూ. మైత్రి మూవీ మేకర్స్ నవీన్ గారు రవి గారు లేకపోతే ఈ సినిమా ఇంత రిచ్, ఇంత గ్రాండ్ గా వచ్చేది కాదు. నా కెరియర్ లోనే ఇది హయ్యస్ట్ బడ్జెట్ సినిమా. ఒక విషయం కాన్ఫిడెంట్ గా చెబుతున్నా. డిసెంబర్ 25 నాడు  రాబిన్‌హుడ్ నిర్మాతలు పెట్టిన డబ్బుని రెంట్టింపుతో సహా మీనుంచి దోచుకొని వారికి ఇస్తాడు. గ్యారెంటీ గా చెబుతున్నా. ఈ క్రిస్మస్ మాదే. థాంక్ యూ' అన్నారు.
 
డైరెక్టర్ వెంకీ కుడుముల మాట్లాడుతూ.. రాబిన్‌హుడ్ స్క్రిప్ట్ చేసుకోవడానికి నాకు చాలా టైం దొరికింది. ఇప్పుడు వరకు నా కెరియర్లో ఈ సినిమా ద బెస్ట్ వర్క్ అనుకుంటున్నాను. ఎడిట్ రూమ్ లో సినిమా చూసుకున్నాను. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. మా ప్రొడ్యూసర్స్ కూడా చూశారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. నన్ను, కథని నమ్మి ఇంత బడ్జెట్ పెట్టిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలకి థాంక్యూ సో మచ్. నన్ను ఎంతో బలంగా నమ్మి సపోర్ట్ చేసే నితిన్ అన్నకి థాంక్యూ. శ్రీలీలని ఇప్పటివరకు అందరూ డాన్సింగ్ క్వీన్ అన్నారు.  ఈ సినిమా చూసిన తర్వాత యాక్టింగ్ క్వీన్ అని కూడా అంటారు. ఈ సినిమాకి జీవి ప్రకాష్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. వన్ మోర్ టైం సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. ఇందులో ఒక ఐటెం సాంగ్ ఉంది. అది కూడా ట్రంప్ కార్డు లాగా ఫీల్ అవుతున్నాం.  క్రిస్మస్ హాలిడేస్ కి ఒక సెలబ్రేషన్ లో ఉండాలని డిసెంబర్ 25న ఈ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నాం.  డెఫినెట్ గా ఇది చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ అవుతుంది. అందరికీ నచ్చుతుంది' అన్నారు