సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 జులై 2020 (13:57 IST)

మాంసాహారాన్ని పోలిన శాకాహారం: జెనీలియా దంపతుల కొత్త బిజినెస్

బాలీవుడ్ ప్రేమ దంపతులు రితేశ్ దేశ్‌ముఖ్, జెనీలియా కొత్త బిజినెస్‌ ప్రారంభించింది. దక్షిణాదిన స్టార్ హీరోయిన్‌గా రాణించిన జెనీలియా ఆపై బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్‌ను వివాహం చేసుకొని ముంబైలో సెటిల్ అయ్యింది. అయితే, ఈ సెలెబ్రిటీ కపుల్స్ గత నాలుగేళ్లుగా మాంసాహారానికి దూరంగా ఉంటున్నారు. భవిష్యత్తులో మాంసం ముట్టుకోకూడదని తీర్మానించారు. 
 
ఈ జంట అప్పటి నుంచి శాకాహారమే తీసుకుంటున్నారు. అయితే, రుచిలోనూ, వాసనలోనూ, పోషక పదార్ధాల్లోనూ మాంసాన్ని తలపించేలా కొన్ని మొక్కలు ఉన్నాయి. మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా వాటిని తీసుకుంటూ ఉంటారు. గత కొన్నేళ్లుగా ఈ సెలెబ్రిటీ జంట వాటిని ఆహారంలో వినియోగిస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ మొక్కలతో తయారయ్యే ఆహారాన్ని భారత్‌లో ఉత్పత్తి చేయాలని జెనీలీయా దంపతులు భావించారు. ఇందులో భాగంగా మాంసాహారాన్ని పోలిన రుచికరమైన శాకాహారాన్ని ప్రజలకు అందజేయాలని భావిస్తున్నారు. 
 
ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఆర్చర్ డేనియల్స్ మిడ్ ల్యాండ్ గుడ్ పుడ్స్‌ ఇనిస్టిట్యూట్‌ కలిసి జెనీలియా దంపతులు ఇమేజిన్ మీట్ పేరుతో భారత్‌లో బిజినెస్‌ను లాంచ్ చేయబోతున్నారు. ఈ ఇమేజిన్ మీట్ ద్వారా బిర్యానీ, కబాబ్ వంటి ఆహార పదార్థాలు తయారు చేసుకోవచ్చని ఈ సెలెబ్రిటీ కపుల్స్ చెప్తున్నారు.