ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By

ఆస్కార్ రేసులో డియర్ కామ్రేడ్‌ను వెనక్కి నెట్టిన గల్లీబాయ్

వెండితెరపై కనిపించే ప్రతి నటుడుకి ఆస్కార్ అవార్డు అందుకోవడం అనేది జీవిత లక్ష్యం. కళారంగానికి ఇచ్చే అవార్డులన్నింటిలోకెల్లా అత్యంత ప్రతిష్టాత్మకమైనది ఆస్కార్ అవార్డు. ఆ అవార్డు రావాలని ప్రతి ఒక్క నటుడు తమ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తుంటాడు. 
 
ఆస్కార్ పురస్కారాలు ప్రధానంగా హాలీవుడ్ చిత్రరంగానికి చెందినా, ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరీ కారణంగా ఆస్కార్ అంటే అందరిలోనూ క్రేజ్ పెరిగిపోయింది. ఈ కేటగిరీలో పోటీ పడేందుకు ప్రతి దేశం నుంచి ఆస్కార్‌కు నామినేషన్లు వెళుతుంటాయి. 
 
ఈసారి భారత్ నుంచి రణవీర్ సింగ్ హీరోగా నటించిన 'గల్లీబాయ్' చిత్రం ఆస్కార్ నామినేషన్లకు అర్హత సాధించింది. 'గల్లీబాయ్' చిత్రం 92వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో పోటీపడనుంది. 
 
భారత్ నుంచి ఆస్కార్‌కు వెళ్లే చిత్రం కోసం జ్యూరీ 28 సినిమాలను వీక్షించి వాటిలో 'గల్లీబాయ్'కే ఓటేసింది. కాగా, ఆస్కార్ నామినేషన్ కోసం విజయ్ దేవరకొండ నటించిన టాలీవుడ్ మూవీ 'డియర్ కామ్రేడ్' చిత్రం కూడా రేసులో నిలిచింది. అయితే జ్యూరీ సభ్యులు 'గల్లీబాయ్' వైపే మొగ్గుచూపారు.