డైరక్షన్ వద్దే వద్దు.. అండర్ వేర్లు అమ్ముకుని జీవనం సాగిస్తా: హన్సాల్ మెహతా
దర్శకత్వాన్ని వదులుకుని, అండర్ వేర్లు అమ్ముకుని జీవనం సాగిస్తానని అలీగఢ్ చిత్ర దర్శకుడు హన్సాల్ మెహతా అన్నారు. సెన్సార్ బోర్డ్ చీఫ్ పహాలాజ్ నిహలానీ తన అలీగఢ్ సినిమా ట్రైలర్‌కు ''ఏ'' సర్టిఫికేట్ ఇవ్వడాన్ని మెహతా ఆక్షేపించారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు విధించిన కట్స్ చూసి షాక్ తిన్నానని.. వీటిని తాను అంగీకరించే ప్రసక్తే లేదని, ట్రైబ్యునల్‌కు వెళ్తానని స్పష్టం చేశారు. తాను ఇలాంటి చీప్ పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నానని నిహలానీ వ్యాఖ్యానించడాన్ని మెహతా తప్పుబట్టారు.
శ్రీనివాస్ రామచంద్ర సిరాస్ జీవిత కథ ఆధారంగా తాను తెరకెక్కించిన అలీగఢ్ చిత్ర ట్రయిలర్‌కు ఏ సర్టిఫికెట్ ఇవ్వడంపై హన్సాల్ మెహతా-పహాలాజ్‌ల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. లైంగిక వేధింపుల ఆరోపణలతో విధుల నుంచి తొలగించబడ్డ ప్రముఖ ప్రొఫెసర్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ నేపథ్యంలో తాను నిజాయితీగా చిత్రాన్ని తెరకెక్కించానని తెలిపారు. సెన్సార్ షిప్ అంటే, సినిమాకు సర్టిఫికెట్‌గా ఉండాలే తప్ప కటింగులు కాదని చెప్పారు.