గురువారం, 13 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : గురువారం, 13 ఫిబ్రవరి 2025 (12:10 IST)

బాహుబలితో నా 544వ చిత్రాన్ని చేస్తున్నందుకు ఆనందంగా ఉంది : అనుపమ్ ఖేర్

Anupam Kher,  Hanu Raghavapudi, and others
Anupam Kher, Hanu Raghavapudi, and others
బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తన 544వ చిత్రం గురువారం ప్రకటించారు. 'భారతీయ సినిమా బాహుబలి' ప్రభాస్‌తో కలిసి స్క్రీన్ స్పేస్ పంచుకుంటున్నట్లు ఆనందంగా ఉంది అని సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు, దీనికి ఇంకా పేరు పెట్టలేదు. అని ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి తో కూడిన ఫోటోను షేర్ చేసారు. అనుపమ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి, ప్రభాస్‌తో కలిసి పోజులిచ్చిన చిత్రాన్ని పంచుకున్నారు. చిత్రంలో. సీనియర్ నటుడు పాన్-ఇండియా స్టార్‌ను కౌగిలించుకున్నట్లు కనిపిస్తుంది.
 
ఈ చిత్రానికి సీతా రామం ఫేం హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోంది. ప్రస్తుతం ప్రభాస్, మారుతీ దర్శకత్యంలో రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు. మరో వైపు ఫౌజ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఆది పురుష్ సినిమా చేసాడు. అది పెద్దగా ఆడలేదు. కనుక హను రాఘవపూడి యూనిక్ కథతో రానున్నట్లు తెలుస్తోంది. మార్చి నెలలో ప్రభాస్ షూటింగ్ లో పాల్గొననున్నారు. మరిన్ని వివరాలు తెలియనున్నాయి.