బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 16 డిశెంబరు 2021 (17:03 IST)

గీత -లో మూగ యువ‌తిగా హెబ్బా పటేల్ ప్రతినాయకుడిగా సాయికిరణ్

VV Vinayak, Vishwa, Rachaya,
వి.వి.వినాయక్ శిష్యుడు "విశ్వ"ను దర్శకుడిగా పరిచయం చేస్తూ  ఆర్.రాచయ్య నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం`గీత`. మ్యూట్ విట్నెస్" అన్నది ఉప శీర్షిక. హెబ్బా పటేల్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సునీల్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. హెబ్బా పటేల్ అనాథల కోసం పోరాడే మూగ యువతిగా న‌టిస్తోంది. "నువ్వే కావాలి, ప్రేమించు" వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించిన సాయి కిరణ్ ప్రతి నాయకుడిగా పరిచయమవుతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ దాదాపుగా పూర్తి చేసుకుని తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను దర్శకులు వి.వి.వినాయక్ విడుదల చేశారు.
 
- తన శిష్యుడు విశ్వ, దర్శకుడిగా పరిచయమవుతున్న "గీత' ఘన విజయం సాధించాలని, తన మిత్రుడు రాచయ్య నిర్మాతగా రాణించాలని వి.వి.వినాయక్ అభిలషించారు. ఈ చిత్రంలో పని చేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకున్నారు.
 
- ఈ సినిమా అవకాశం తన గురువు, దైవం అయిన వినాయక్ గారే ఇప్పించారని, నిర్మాత రాచయ్యగారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని చిత్ర దర్శకుడు విశ్వ పేర్కొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న హిందీ "ఛత్రపతి" పనులతో తలమునకలుగా ఉన్నప్పటికీ తమ మీద ప్రత్యేకమైన అభిమానంతో "గీత" చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన వినాయక్ గారికి నిర్మాత ఆర్.రాచయ్య కృతజ్ఞతలు తెలిపారు. గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకునేలా డైరెక్టర్ విశ్వ  "గీత" చిత్రాన్ని అత్యద్భుత ప్రణాళికతో రూపొందించారని  పేర్కొన్నారు!!
- రామ్ కార్తిక్, సప్తగిరి, రాజీవ్ కనకాల, పృథ్వి (30 ఇయర్స్), తనికెళ్ళ భరణి, సంధ్యా జనక్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.