హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్
చరణ్ సాయి, ఉషశ్రీ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా ఇట్స్ ఓకే గురు. ఈ చిత్రాన్ని వండర్ బిల్ట్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సురేష్ అనపురపు, బస్వ గోవర్థన్ గౌడ్ నిర్మిస్తున్నారు. దర్శకుడు మణికంఠ ఎం రూపొందిస్తున్నారు. త్వరలో ఇట్స్ ఓకే గురు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ రోజు ఈ సినిమా నుంచి హీరో సిద్ధార్థ్ పాడిన నా శ్వాసే నువ్వై లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.
నా శ్వాసే నువ్వై పాటను సంగీత దర్శకుడు మోహిత్ రెహ్మానియక్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేయగా..రాహుల్ రెడిన్ఫినిటీ లిరిక్స్ రాశారు. హీరో సిద్ధార్థ్ ఆకట్టుకునేలా పాడారు. ఈ పాట ఎలా ఉందో చూస్తే - 'నా శ్వాసే నువ్వై పోయావే, నా ప్రాణం నీదంటూ, నా మనసే నీదై పోయిందే, నేనంటే నువ్వంటూ, రోజంతా హంగామా జరిగేలా, ప్రతి పూటా పండగలా పెరిగావే, నాలోని అణువణువు తెలిసేలా మైండంతా మైకెట్టి అరిచావే....' అంటూ మంచి లవ్ ఫీల్ తో సాగుతుందీ పాట.
నటీనటులు - చరణ్ సాయి, ఉష శ్రీ,, సుధాకర్ కోమాకుల తదితరులు