గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 4 జనవరి 2018 (10:37 IST)

ఆ దర్శకుడు వాడేసుకున్నాడంటున్న హీరోయిన్

కోలీవుడ్ చిత్రపరిశ్రమకు పరిచయమై తెరమరుగైన హీరోయిన్లలో మనీషా యాదవ్ ఒకరు. బాలాజీ శక్తివేల్ దర్శకత్వంలో "వళక్కు ఎన్ 18/9" (కేసు నంబరు 18/9) అనే చిత్రం వచ్చింది. ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌‌‌లో మనీషా కనిప

కోలీవుడ్ చిత్రపరిశ్రమకు పరిచయమై తెరమరుగైన హీరోయిన్లలో మనీషా యాదవ్ ఒకరు. బాలాజీ శక్తివేల్ దర్శకత్వంలో "వళక్కు ఎన్ 18/9" (కేసు నంబరు 18/9) అనే చిత్రం వచ్చింది. ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌‌‌లో మనీషా కనిపిస్తుంది. ఈ చిత్రం విడుదలైన చాలా రోజులకు దర్శకుడిపై ఆమె సంచలన ఆరోపణలు చేస్తున్నారు.
 
తనతో ఓ స్పెషల్ సాంగ్‌ను షూట్ చేస్తున్నామని చెప్పిన దర్శకుడు... తనతో ఓ ఐటమ్ సాంగ్ చేయించి దారుణంగా మోసం చేశాడంటూ ఆరోపణలు చేసింది. ఓ పాట, సినిమాను మలుపు తిప్పే కీలక సన్నివేశాల్లో తానుంటానని చెప్పిన దర్శకుడు, తొలుత ఓ 'స్వప్న సుందరి' పాటను తీశాడని, అది స్పెషల్ సాంగ్ అని చెప్పాడని, ఆపై సినిమా రిలీజైన తర్వాతే అది ఐటమ్ సాంగని తెలిసిందని, ఇప్పుడు తనను ప్రతి ఒక్కరూ 'స్వప్నసుందరి'గానే పిలుస్తున్నారని వాపోయింది. దర్శకుడు అలా చేసుండాల్సింది కాదని, తాను ఐటమ్ గర్ల్ అని అనిపించుకోవడానికి ఇష్టపడటం లేదని చెప్పుకొచ్చింది. 
 
కాగా, ఈ భామ దర్శకులపై ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. 'త్రిష ఇల్లెన్నా నయనతార' అనే చిత్రంలో తనతో కావాలనే అసభ్య సంభాషణలు పలికించి, ఓవర్ గ్లామర్‌గా చూపించారని అధిక్ రవిచంద్రన్‌పై మనీషా గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పెళ్లి చేసుకుని సంసార జీవితంలో ఉన్న ఈ సుందరి, ఆ మధ్య 'చెన్నై-28' సీక్వెల్‌లో కూడా నటించింది.