మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 5 జూన్ 2017 (09:34 IST)

పవన్ కల్యాణ్ అన్నాన్ని పక్కనబెట్టేశారట.. మొహం ఉబ్బిపోయిందట.. అందుకే?

పవర్ స్టార్, పవన్ కల్యాణ్ ఫిట్‌నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మార్షల్ ఆర్ట్స్‌లో ఆరితేరిన పవన్ కల్యాణ్.. తన ఎత్తుకు తగిన వెయిట్‌తో యాక్టివ్‌గా ఉండే పవన్‌కు కొత్తగా ఓ సమస్య వచ్చి పడింది. మామూ

పవర్ స్టార్, పవన్ కల్యాణ్ ఫిట్‌నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మార్షల్ ఆర్ట్స్‌లో ఆరితేరిన పవన్ కల్యాణ్.. తన ఎత్తుకు తగిన వెయిట్‌తో యాక్టివ్‌గా ఉండే పవన్‌కు కొత్తగా ఓ సమస్య వచ్చి పడింది. మామూలుగా వైట్ రైస్, కూరలు మినహా వేరే ఆహారాన్ని పవన్ ఎక్కువగా తీసుకోడట. కానీ ప్రస్తుతం వైట్ రైస్‌ను దూరంగా పెట్టాలని పవన్‌ నిర్ణయించుకున్నాడట.
 
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సూచన మేరకు పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వైట్ రైస్ కారణంగా పవన్ ముఖం కొంచెం ఉబ్బుతోందట. దీంతో, వైట్ రైస్‌ను పక్కనబెట్టాలని త్రివిక్రమ్ సూచించారట. వీళ్లిద్దరి కాంబోలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు వైట్ రైస్‌ లేకుండా మెనూ సిద్ధం చేసుకోవాలని పవన్ నిర్ణయించుకున్నాడట. 
 
పవన్ కల్యాణ్ సినిమా కెరీర్‌లో బరువుతో ఇబ్బంది పడిన సందర్భాలు లేవు. ప్రస్తుతం 46 ఏళ్ల వయసులో పవన్‌కు ఓ సమస్య వచ్చిందట. తెల్ల అన్నం తింటే పవన్‌ మొహం కాస్త ఉబ్బి పోతుండటంతో.. అన్నాన్ని పక్కనబెట్టి... వేరే ఆహార పదార్థాలు తినాలని డిసైడ్ అయ్యాడు.