1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 మే 2025 (20:07 IST)

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

Pakistani MP Shahid Ahmad Khattak
భారత సైన్యం జరిపే దాడుల నుంచి తప్పించుకునేందుకు పాకిస్థాన్ సైన్యం సరిహద్దుల్లో బంకర్లు ఏర్పాటు చేసుకుని వాటిల్లో దాక్కుంటుంది. ఈ బంకర్లను సైతం తుత్తునియలు చేసేలా భారత్ ఆయుధాలను ప్రయోగిస్తుంది. ఆ ఆయుధం పేరు యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్. దీని పనితీరును తెలుసుకున్న పాక్ సైనికులు బెంబేలెత్తిపోతున్నారు. పాక్ సైనికులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న బంకర్లను ఈ మిసైల్ ధ్వంసం చేస్తోంది. 
 
భారీగా సాయుధ కవచాలతో డిజైన్ చేసిన వాహనాలను ధ్వంసం చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. ఒక్కసారి దీనిలో ట్యాంక్ లేదా టార్గెట్‌ను లాక్ చేస్తే దానంతట అదే లక్ష్యాన్ని వెంటాడి ఛేదిస్తుంది. దీనిని భుజం పైనుంచి లేదా ట్రైపోడ్, వాహనాలపై అమర్చి ప్రయోగించవచ్చు. సురక్షితమైన దూరం నుంచి సాయుధ బలగాలను ఎదుర్కోవడానికి ఇది సరైన ఆయుధంగా మారింది. 
 
ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా ఆయుధాలను 130 దేశాలు వినియోగిస్తున్నాయి. ఇక భారత్ చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా వీటిని వినియోగిస్తుంది. ప్రస్తుతం భారత్ వద్ద నాగ్, ధృవాస్త్ర (హెలినా) వంటిని అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. 
 
అన్ని రకాల పరిస్థితుల్లో పగలు, రాత్రి పని చేసేలా వీటిని తయారు చేశారు. వీటిల్లో కొన్నింటికి టాప్ అటాక్ మోడ్ ఉంటుంది. వీటిని ప్రయోగించిన తర్వాత గాల్లోకి ఎత్తుకు ఎగిరి ట్యాంక్ టాప్‌‍పై పడుతుంది. దీనిలో డ్యూయల్ మోడ్ సీకల్ అనే ఆప్షన్ ఉంది. ఇది లక్ష్యాన్ని గుర్తించి దానిని వెంటాడేలా చేస్తుంది.