నాకు శీతాకాలం అంటే ఇష్టం లేదు, సమ్మర్ అంటే ఇష్టం : తమన్నా
సత్యదేవ్, తమన్నా జంటగా నటించిన సినిమా గుర్తుందా శీతాకాలం". కన్నడ దర్శకుడు, నటుడు నాగశేఖర్ ని తెలుగుకి దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వేదాక్షర ఫిల్మ్స్ , నాగశేఖర్ మూవీస్ మరియు మణికంఠ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్స్ పై నిర్మాతలు చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నారు, చిత్రాన్ని డిసెంబర్ 9 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్న సందర్బంగా చిత్ర యూనిట్ ప్రి రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరుపుకున్నారు.
ముఖ్య అతిధి అడవి శేష్ మాట్లాడుతూ. .సత్య నాకు చాలా మంచి ఫ్రెండ్, నా సినిమా హిట్ అయిన జోష్ లో ఉన్న కూడా సత్య సినిమా కోసం చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను. దర్శకుడు నాగ శేఖర్ కు నేను బిగ్ ఫ్యాన్ ని తను కన్నడ లో తీసి బిగ్ హిట్ కొట్టిన "మైనా" సినిమా చాలా ఇష్టం. ఆ సినిమా మాదిరి ఈ సినిమా కూడా బిగ్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను.ఈ సినిమాకు కాలభైరవ ఇచ్చిన మ్యూజిక్ ను అందరూ ప్లే లిస్ట్ లో పెట్టుకొని వినే విధంగా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు.. నేనెప్పుడో తమన్నాతో యాక్టింగ్ చేయాలనుకున్నాను కానీ కుదరలేదు. మంచి కథతో వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు అందరూ కూడా ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
హీరో సత్యదేవ్ మాట్లాడుతూ..మా సినిమా బ్లెస్స్ చేయడానికి వచ్చిన శ్రీ కళ్యాణ్ గారికి, సతీష్ గారికి, శేషు గారికి ధన్యవాదాలు. శేషు చేసే ప్రతి సినిమా కూడా ప్రాణం పెట్టి ఎంతో కష్టపడి చేస్తాడు. అందుకే తను చేసిన సినిమాలన్నీ హిట్ సాధిస్తాడు.తను మా ఫంక్షన్ కి వచ్చాడు అంటే ఈ సినిమా కూడా హిట్ అవుతుందని అనుకుంటున్నాను. తమన్నా లాంటి బిగ్ యాక్ట్రెస్ తో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ ఈ సినిమా నాది అనుకుంటారు. కానీ ఈ సినిమా తమన్నా, గ కావ్య శెట్టి, మెగా ఆకాష్ లది.వీళ్ళు ముగ్గురు మధ్యలో నేను నటిస్తున్నాను.భూపాల్ గారు అద్భుతమైన డైలాగ్స్ రాశారు.నాగ శేఖర్ గారు చాలా మంచి వ్యక్తి తనుకు ఎన్ని సమస్యలు ఉన్నా మాకు ఫుల్ ఎనర్జీ నింపుతూ మాతో ఒక చక్కటి నటనను రాబట్టుకొన్నాడు.ఈ సినిమా చూసిన వారందరూ కచ్చితంగా స్మైల్ తో బయటకు వస్తారు.
మిల్క్ బ్యూటీ తమన్నా మాట్లాడుతూ..ఇప్పటివరకు నాకు శీతాకాలం అంటే ఇష్టం లేదు నాకు సమ్మర్ అంటే ఇష్టం.కానీ ఈ సినిమాలో యాక్ట్ చేశాక చాలా బ్యూటిఫుల్ విజువల్స్ చూశాను. కాలభైరవ తన మ్యూజిక్ తో సినిమాకు నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాడు. నాగ శేఖర్ గారు అద్భుతమైన దర్శకుడు. ఇంతకుముందు నేను సత్యదేవ్ గారి ఉమామహేశ్వర సినిమా చూశాను. అప్పుడే అనిపించింది తనతో సినిమా చేయాలని కానీ ఇంత త్వరగా చేస్తాను అనుకోలేదు. డిసెంబర్ 9న వస్తున్న ఈ సినిమాను అందరూ చూసి చేయాలని కోరుకుంటున్నాను అన్నారు