ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 ఆగస్టు 2024 (14:12 IST)

తమన్నాతో నా రిలేషన్ నిజమే.. నా వద్ద 5వేల ఫోటోలున్నాయ్?

Vijay Varma _Tamannah
Vijay Varma _Tamannah
స్టార్ హీరోయిన్ తమన్నాతో తన రిలేషన్‌ని రహస్యంగా ఉంచడం తనకి నచ్చలేదని నటుడు విజయ్ వర్మ అన్నారు. "మా ఇద్దరి ఫొటోలు నా వద్ద సుమారు 5000 ఉన్నాయి. కానీ సోషల్‌ మీడియాలో ఎక్కడా వాటిని ఇప్పటివరకూ షేర్‌ చేయలేదు. ఎందుకంటే అవి మాకు మాత్రమే సంబంధించినవి" అంటూ విజయ్ అన్నారు. 
 
ఏదైనా బంధాన్ని మనం ఎంజాయ్ చేస్తున్నప్పుడు.. వారితో కలసి సమయాన్ని ఆస్వాదించాలనుకున్నప్పుడు.. ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నప్పుడు దానిని దాచి ఉంచాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఫీలింగ్స్‌ను బంధించడం తనకు ఇష్టం వుండదని, తన వద్ద వున్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడం మానేశానని.. ఎందుకంటే ఇవి విలువైనవని.. తమ హృదయానికి ప్రియమైనదిగా ఉండాలని చెప్పారు. 
 
తమన్నా భాటియా, దాదాపు ఇరవై సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీలో వుంది. ఆమె తెలుగు, హిందీ, తమిళం, మలయాళం సినిమాల్లో నటించింది. హైదరాబాద్‌కు చెందిన విజయ్ వర్మ ఇటీవల నటుడిగా పేరు తెచ్చుకున్నారు. బాలీవుడ్ సినిమాల్లో నటించాడు. వీరిద్దరూ ప్రేమలో వున్నారని.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ వస్తోంది.