ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: సోమవారం, 14 మే 2018 (17:25 IST)

రూ.10,000 పెట్టి రాంచరణ్ వద్ద ఐస్‌క్రీం కొన్నాను... ఎందుకో తెలుసా?

సినిమా వాళ్ళ కాఫీకి రేటు ఎక్కువ అని శ్రీ నందమూరి తారక రామారావు గారు చెబుతుండేవారని విన్నాను. నిజమే సినిమా వాళ్ళ ధరలు ఎక్కువే. ఇటీవల ఓ ఐస్ క్రీమ్‌ను నేను రూ.10,000 పెట్టి కొన్నాను. చాలా చాలా ఖరీదు కదా! అయినా నాకు బాధ కలగలేదు. సంతోషం కలిగింది.. ఎందుక

సినిమా వాళ్ళ కాఫీకి రేటు ఎక్కువ అని శ్రీ నందమూరి తారక రామారావు గారు  చెబుతుండేవారని  విన్నాను. నిజమే సినిమా వాళ్ళ ధరలు ఎక్కువే. ఇటీవల ఓ ఐస్ క్రీమ్‌ను నేను రూ.10,000 పెట్టి కొన్నాను. చాలా చాలా ఖరీదు కదా! అయినా నాకు బాధ కలగలేదు. సంతోషం కలిగింది.. ఎందుకంటే రూ.10000 పెట్టి ఆ ఐస్‌క్రీం కొనడానికి ఓ కారణం ఉంది. 
 
మంచు లక్ష్మి గారు నిర్వహిస్తున్న మేము సైతం కార్యక్రమం ఫండ్ రైజింగ్ కోసం మా మెగా పవర్‌స్టార్ రామ్‌ చరణ్ శీతల పానీయాలు అమ్మారు. ఆయన దగ్గరే నేను పది వేలు పెట్టి ఐస్‌క్రీమ్ కొన్నాను. అలా మేము సైతం కార్యక్రమంలో నేను కూడా భాగస్వామిని కావడం ఎంతో సంతోషం కలిగించింది.