1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chitra
Last Updated : గురువారం, 6 అక్టోబరు 2016 (11:05 IST)

ఆప్ పార్టీ కాదు.. పాప్ పార్టీ.. ఎప్పుడూ మఫ్లర్ క్యాప్‌తో మంకీలా కేజ్రీవాల్: వర్మ

తన ట్వీట్లతో ఎప్పుడు వార్తల్లో నిలిచే వ్యక్తి రామ్‌గోపాల్‌వర్మ. తన సినిమాలతో ఇండస్ట్రీలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ సర్జికల్ దాడులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ ముఖ్యమం

తన ట్వీట్లతో ఎప్పుడు వార్తల్లో నిలిచే వ్యక్తి రామ్‌గోపాల్‌వర్మ. తన సినిమాలతో ఇండస్ట్రీలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ సర్జికల్ దాడులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై మండిపడ్డాడు. "ఎప్పడు మఫ్లర్ క్యాప్‌తో ఉన్న ఆయన్ని చూస్తే నేను మంకీలాగా ఉన్నాడు అని అనుకునేవాణ్ని. 

అయితే ఆర్మ్‌డ్ ఫోర్స్‌పై ఆయన చేసిన కామెంట్స్ తర్వాత నిజం తెలిసింది. ఆయన నిజంగానే మంకీ.. అని నేను భావిస్తున్నాను." అంటూ ట్వీట్‌లో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కేజ్రీది ఆప్ పార్టీ కాదని పాప్ పార్టీ అని పేరు మార్చుకోవాల్సిందిగా వర్మ సూచించాడు. పాప్ పార్టీ అంటే పి అంటే పాకిస్థాన్ మరో పి అంటే పార్టీ అంటూ వర్మ వివరణ ఇచ్చారు. 
 
పాకిస్థాన్‍లో భారత్ జరిపినట్టు చెబుతున్న లక్షిత దాడులకు ఆధారం ఏమిటని ప్రశ్నించిన కేజ్రీవాల్‌ను పాకిస్తాన్‌ ప్రభుత్వం హీరోగా అభివర్ణిస్తూ హెడ్‌లైన్ కథనాలు ప్రచురించాయి. దీంతో బీజేపీ శ్రేణులు దేశరాజధానిలో ఆందోళనకు దిగాయి. కేజ్రీవాల్ నివాసానికి పెద్దఎత్తున చేరుకున్న బీజేపీ కార్యకర్తలు ఆయన నివాసం ఎదుట ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో వర్మ ఆయనపై పరోక్ష దాడి చేశారు. పాక్ ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ చేపట్టిన సర్జికల్ దాడులకు సంబంధించిన ఆధారాలు బయటపెట్టాలని విమర్శలు సరికాదని వర్మ అభిప్రాయపడ్డారు. అసలు సర్జికల్ దాడులు జరిగాయా అని అనుమానాలు వ్యక్తం చేసిన కేజ్రీవాల్‌ను పలువురు రాజకీయ విమర్శిస్తున్నారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన కార్యకర్తలు తక్షణం కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భారత ఆర్మీని తక్కువ అంచనా వేసే మాటలు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వెంటనే మానుకోవాలని సూచిస్తున్నారు.