మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 8 అక్టోబరు 2018 (12:46 IST)

ఫిట్‌నెస్ గురించి అడిగితే నాకు పిచ్చకోపం వస్తుంది.. నాగార్జున..

టాలీవుడ్ 'మన్మథుడు' నాగార్జున, బిగ్ బాస్ తెలుగు 2 యాంకర్ నాని నటించిన "దేవదాస్" చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ సందర్భంగా నాగార్జున ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ, ఆ ఛానెల్ నాగ్‌తో మాట్లాడుతుండగా.. నాగార్జున నేను టీవీ చూడను, న్యూస్ పేపర్ చదవని చెప్పారు. అప్పుడు ఛానెల్ వాళ్లు మీ ఫిట్‌నెస్ రహస్యం ఏంటి నాగ్ అని అడిగారు.
 
నాగార్జున ఈ వార్తపై స్పందిస్తూ నేను ఎక్కడికి వెళ్లినా ఇదే ప్రశ్ననే అందరూ అడుతున్నారు. ఇంకోసారి మళ్లీ మళ్లీ ఈ ప్రశ్న రిపీట్ అయితే నాకు పిచ్చ కోపం వస్తుందని అన్నారు. అలా మాట్లాడుతూ.. ఈ విషయానికి వస్తే నన్ను 59 ఏళ్ల నాగార్జున అంటూ చెప్తారని తెలియజేశారు. అలానే ఇది నాకొక్కడికి మాత్రమే జరుగుతుందని సరదాగా మాట్లాడారు. 
 
నాగార్జున.. నేను ఎందుకు ఇలా ఉన్నానంటే 'దేవదాస్' చిత్రం మల్టీ స్టారర్ సినిమా కనుక నానితో పోటి పడి నటించాల్సి వచ్చిందని చెప్పారు. ఈ ఇంటర్వ్యూలో 'దేవదాస్' మూవీ నిర్మాత అశ్వనీదత్ కూడా పాల్గొన్నారు.