సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 5 ఫిబ్రవరి 2022 (19:29 IST)

మరోసారి క‌నువిందు చేసిన ఇలియానా

Ileana D'Cruz
మరోసారి పరువాల విందు చేసింది ఇలియానా. తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ఫొటోలు ఉంచడానికి ఇష్టపడే బాలీవుడ్ నటి ఇలియానా డిక్రూజ్, తాజాగా బాడీ పాజిటివిటీపై అభిమానుల‌తో పంచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ఎరుపు రంగు స్విమ్‌వేర్ ధరించి ఉన్న చిత్రాన్ని షేర్ చేసింది. ఒక‌ప్పుడు కాస్త లావుగా వుండే ఇలియాన ఇటీవ‌ల స‌న్న ప‌డింది. అందుకు కార‌ణాన్ని వివ‌రిస్తూ "మీరు "సన్నగా", "మరింత టోన్‌గా" కనిపించేలా చేయడానికి మీ శరీరాన్ని అప్రయత్నంగా మార్చే యాప్‌లలోకి ప్రవేశించడం చాలా సులభం. నేను ఆ యాప్‌లన్నింటినీ తొలగించి, బదులుగా దీన్ని ఎంచుకున్నందుకు గర్వపడుతున్నాను. యోగాలు చేస్తాను. వ్యాయామం చేస్తానంటూ తెలుపుతోంది.
 
ఎక్కువ‌గా స్విమ్ చేసే ఇలియానా అందులోనే ర‌హ‌స్యం దాగుంద‌ని తెలుపుతుంది. ఆమె  పోస్ట్‌కి నువ్వు అందంగా ఉన్నావు అంటూ ఫాలోవ‌ర్స్ తెగ జోడిస్తున్నారు. ఇటీవ‌లే ఇలియానా స్విమ్ చేస్తున్న ఫొటోను పెట్టింది. కానీ ఈ ఫొటో హాట్ టాపిక్‌గా మారింది. సినిమాల‌కు దూరంగా వున్న ఇలియానా ఇటీవ‌లే ఓ తెలుగు సినిమాలో న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఆ వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌నున్నాయి.