మంగళవారం, 26 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 జనవరి 2024 (21:03 IST)

ఆస్కార్ అవార్డ్స్‌కు భారతీయ డాక్యుమెంటరీ టు కిల్ ఎ టైగర్

Kill A Tiger
Kill A Tiger
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్స్‌కు భారతీయ డాక్యుమెంటరీ నామినేట్ అయ్యింది. ఫిల్మ్ మేకర్ నిషా పహుజా భారతీయ డాక్యుమెంటరీ టు కిల్ ఎ టైగర్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ 2024కి నామినేట్ చేయబడింది.
 
96వ ఆస్కార్‌లకు నామినేషన్‌లను మంగళవారం (జనవరి 23) సాయంత్రం జాజీ బీట్జ్, జాక్ క్వాయిడ్ ప్రకటించారు. క్రిస్టోఫర్ నోలన్ ఒపెన్‌హైమర్, గ్రెటా గెర్విగ్ బార్బీ నామినేషన్లలో ఆధిపత్యం చెలాయించాయి. వీటికి అత్యధిక ఆమోదం లభించింది. 
 
డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో మార్టిన్ స్కోర్సెస్ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, ఎమ్మా స్టోన్ నటించిన పూర్ థింగ్స్ ఉన్నాయి. ఇందులో టు కిల్ ఎ టైగర్ బోబి వైన్: ది పీపుల్స్ ప్రెసిడెంట్, ది ఎటర్నల్ మెమరీ, ఫోర్ డాటర్స్, 20 డేస్ ఇన్ మారియుపోల్ వంటి ఇతర డాక్యుమెంటరీలతో పోటీపడుతుంది.