ఆదివారం, 3 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 27 మే 2023 (16:08 IST)

వినూత్నంగా శివ కోన రెసిపీ అండర్ మ్యారినేషన్ పోస్టర్

Siva kona poster
Siva kona poster
ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోనా సంయుక్తంగా నిర్మిస్తూ.. శివా కోన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను శివ కోన రెసిపీ అండర్ మ్యారినేషన్ అంటూ ఓ పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. అండర్ ప్రోడక్షన్ లో ఉన్న ఈ సినిమా పేరు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్ అయితే చాలా కొత్తగా ఉండీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 
 
ప్రధానంగా ఈ పోస్టర్లో క్యారెక్టర్ల ముఖాలు కనిపించకపోవడం అందరిలో ఇంకాస్త ఆసక్తిని పెంచుతోంది. ఈ పోస్టర్ ను చూస్తే మొత్తం ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు పక్కనే ఒక మిడిల్ ఏజ్ డ్ క్యారెక్టర్ ఉన్నట్లు కనిపిస్తుంది.  ఈ సినిమా పోస్టర్ ను బట్టి ఈ సినిమా ఓ క్రైమ్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా తెరక్కబోతుందని అర్థం అవుతుంది. కాలేజీకి వెళ్లే కుర్రాళ్ల చేతుల్లో గన్ను ఉంది. వాళ్ల పక్కనే ముగ్గురు అందమైన అమ్మాయిలు ఉన్నారు. వీరికి ముందు ఒక సూటు వేసుకున్న గ్రే షేడ్ క్యారెక్టర్, తన పక్కనే ఓ గ్లామర్ బ్యూటీ ఉంది. వీరే కాకుండా రేయ్ ఎవర్రా మీరంతా అంటే నోట్లో సిగర్ పెట్టుకుని కొని, చేతిలో కోడిని పట్టుకొని ఒక ఇంట్రెస్టింగ్  క్యారెక్టర్ కుర్చీలో కూర్చున్న పోస్టర్ ఆలరిస్తోంది. 
 
ఇక పోస్టర్ బట్టి చూస్తే ఇది కచ్చితంగా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంటెన్సీవ్ సబ్జెక్ట్ అని అర్థం అవుతుంది. అలాగే మంచి కామెడీ సబ్జెక్ట్ అని కూడా అర్థం అవుతుంది. నటీనటుల ముఖాలను హైడ్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్ సినిమా ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఎలాగో కంటెంట్ కొత్తగా సినిమాలను పెద్ద హిట్ చేస్తున్నారు నేటి ప్రేక్షకులు. మరీ ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ కాన్సెప్ట్ బాగుంది కాబట్టి సినిమాలోని కంటెంట్ కూడా అదిరిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. పోస్టర్లో ఆ క్యారెక్టర్ ఏవరు చేసి ఉంటారో తెలియాలంటే మరో అప్డేట్ కోసం వేచి చూడాల్సిందే. చూద్దాం మరీ ఎలాంటి కంటెంట్ అందిస్తారో.  అండర్ మ్యారెనేషన్ అండు విడుదల చేసిన పోస్టర్ చూసిన తరువాత.. సినిమా పోస్టర్ తోనే మంచి బజ్ ను మేకర్స్ క్రియేట్ చేశారు.