ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 12 ఆగస్టు 2018 (10:11 IST)

మహేష్ బాబు హీరోయిన్‌కు కష్టాలు.. జిరాఫీతో ఆ ఫోటో ఏంటి?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో 1 నేనొక్కడినే సినిమాలో నటించిన కృతిసనన్‌కు ప్రస్తుతం నెటిజన్ల నుంచి కష్టాలు మొదలయ్యాయి. ఛీ.. నిన్ను చూస్తేనే సిగ్గేస్తోంది అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి పనుల వల

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో 1 నేనొక్కడినే సినిమాలో నటించిన కృతిసనన్‌కు ప్రస్తుతం నెటిజన్ల నుంచి కష్టాలు మొదలయ్యాయి. ఛీ.. నిన్ను చూస్తేనే సిగ్గేస్తోంది అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి పనుల వల్ల సమాజానికి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నావంటూ ప్రశ్నించారు. ఇంతకీ నెటిజన్ల ఆగ్రహానికి కృతిసనన్ ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఫోటో షూటే కారణం.
 
వివరాల్లోకి వెళితే.. కాస్మోపాలిటన్ ఇండియా మ్యాగజీన్ తన ఆగస్టు ఇష్యూలో భాగంగా ఇంగ్లండ్‌లోని ఓ మ్యూజియంలో కృతితో ఫొటోషూట్ నిర్వహించింది. వేలాడుతున్న జిరాఫీని పట్టుకుని కృతి సనన్ డిఫరెంట్ యాంగిల్‌లో ఇచ్చిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. తన మ్యాగజీన్ కవర్ పేజీ కోసం పోస్టు చేసిన ఈ ఫొటోలను పొందుపరస్తూ.. ''ఈ జిరాఫీకి ఎటువంటి హానీ కలగలేదు.. ఎందుకంటే.. అది బతికున్న జిరాఫీ కాదు'' అంటూ క్యాప్షన్ జతచేసింది.
 
అంతటితో ఆగకుండా చనిపోయిన మూగ జీవాలను సదరు మ్యూజియంలో పొందుపరుస్తారని పేర్కొంటూ... వాటిపై పరిశోధనలు జరిపేందుకు అనుమతి కూడా ఇస్తారంటూ తెలిపింది. ఈ ఫొటోలను చూసిన జంతు ప్రేమికులు కాస్మో ఇండియా, కృతిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పబ్లిసిటీ కోసం మూగజీవాలను ఇలా వాడుకుంటావా అంటూ ప్రశ్నిస్తున్నారు.