ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 19 జులై 2017 (11:21 IST)

'జ‌గ్గా జాసూస్‌' నటి అనుమానాస్పద మృతి...

బాలీవుడ్ చిత్రం 'జగ్గా జాసూస్'. ఇందులో బిదిషా బెజ్‌బారుహ నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఇపుడు ఈమె అనుమానాస్పదరీతిలో మరణించింది. గూర్గావ్‌లోని ఆమె అపార్ట్‌మెంట్‌లో ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు గురైంది.

అస్సాంకు చెందిన న‌టి, గాయ‌ని అయిన బిదిషా ఇటీవ‌ల రీలీజైన జ‌గ్గా జాసూస్‌లో న‌టించింది. బిదిషా టీవీల్లో అనేక షోలు నిర్వ‌హించింది. ముంబై నుంచి ఇటీవ‌లే గూర్గావ్ చేరుకున్న ఆమె అనుమానాస్ప‌ద రీతిలో చ‌నిపోవ‌డం వివాదాస్ప‌ద‌మైంది. ఈ కేసులో ఆమె భ‌ర్త‌ను విచారించ‌నున్నారు. 
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... ఆమె మొబైల్ ఫోన్‌, ఫేస్‌బుక్‌, సోష‌ల్ సైట్ల ద్వారా ఆమెతో చాట్ చేసిన సందేశాల‌పై ఆరా తీయనున్నారు. ఈ కేసులో విచార‌ణ వేగంగా పూర్తి చేయాల‌ని అస్సాం సీఎం శ‌ర‌బానంద్ సోనోవాల్ హ‌ర్యానా సీఎంను కోరారు.