సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 6 జూన్ 2024 (19:15 IST)

పవన్ కళ్యాణ్ దంపతులకు మెగాస్టార్ చిరంజీవి పూలవర్షంతో స్వాగతం

PawanKalyan   Anna Lezhneva
PawanKalyan Anna Lezhneva
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో జ‌న‌సేన అధినేత ప‌వన్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదుకకుని ఢిల్లీ వెళ్ళి మోదీని కలిసి తిరిగి వచ్చారు.  తన చారిత్రాత్మక ఎన్నికల విజయం తర్వాత, జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ ఢిల్లీలో NDA సమావేశానికి హాజరయ్యారు. ఆ తర్వాత ఆయన ఆశీస్సులు పొందేందుకు మెగాస్టార్ చిరంజీవిని నేడు సాయంత్రం దర్శించారు.
 
PawanKalyan  at chiru house
PawanKalyan at chiru house
ఈ సందర్భంగా అన్నా లెజ్‌నేవాతో వచ్చిన పవన్ కళ్యాణ్ దంపతులకు మెగాస్టార్ జూబ్లీహిల్స్ లోని పూల వర్షం కురిపించి తన అబిమానాన్ని చాటుకున్నారు. ఎన్నికలకు ముందు రెండు కోట్ల పార్టీ ఫండ్ కింద చిరంజీవి ఇచ్చిన విషయం తెలిసిందే.
 
ఇక ప్రచారానికి బయలుదేరేటప్పుడు తన వదిన సుప్రియ తిలకం దిద్ది పంపించారు. ఆ తర్వాత అన్నా లెజ్‌నేవా కూడా బొట్టుపెట్టి యుద్ధానికి సన్నద్దం చేసింది.  ఈరోజు విజయోత్సవ వేడుకలకు మెగా కుటుంబసభ్యులు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ లోని రోడ్ నెం. 25 లో సందడి నెలకొంది. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించి పవన్ ను సహకరించారు.