గురువారం, 27 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 21 అక్టోబరు 2016 (13:27 IST)

20 మంది మృగాళ్ళతో పోరాడేందుకు నా బలం సరిపోలేదు.. ఫలితం పోర్న్‌స్టార్‌గా మారాను : జపాన్ మోడల్

సినిమా అనే రంగుల ప్రపంచంలోకి కోటి ఆశలతో అడుగుపెట్టేవారు ఎందరో ఉన్నారు. ఆ రంగంలో అవకాశం లభించడం ఒక ఎత్తు అయితే, సక్సెస్ సొంతం చేసుకోవడం.. ఆ సక్సెస్‌ను నిలబెట్టుకోవడం మరో ఎత్తు. వీటన్నింటికీ కావాల్సింది

సినిమా అనే రంగుల ప్రపంచంలోకి కోటి ఆశలతో అడుగుపెట్టేవారు ఎందరో ఉన్నారు. ఆ రంగంలో అవకాశం లభించడం ఒక ఎత్తు అయితే, సక్సెస్ సొంతం చేసుకోవడం.. ఆ సక్సెస్‌ను నిలబెట్టుకోవడం మరో ఎత్తు. వీటన్నింటికీ కావాల్సింది ''లక్'' (అదృష్టం). మరీ, ఆ ''లక్'' అందకపోతే... జీవితం ఎటుపోతుందనే దానికి ఉదాహరణే జపాన్‌కు చెందిన పోర్న్‌స్టార్ సాకీ కొజాయ్‌. హీరోయిన్ అవ్వాలని ఎన్నో ఆశలతో ఈ రంగంలోకి అడుగుపెట్టి చివరికి పోర్న్‌స్టార్‌గా తయారైంది. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం... 
 
24 ఏళ్ల సాకీ కొజాయ్‌ అందమైన యువతి. తన అందంతో మోడలింగ్‌లోకి ప్రవేశించి సినిమా స్టార్‌ అయిపోదామని ఎన్నో కలలు కన్నది. చదువు పూర్తయిన వెంటనే ఓ మోడలింగ్‌ ఏజెన్సీని సంప్రదించింది. వారు ఆమెను అన్ని రకాలుగానూ పరీక్షించి ఆమెతో కాంట్రాక్ట్‌ పేపర్ల మీద సంతకం చేయించుకున్నారు. రెండ్రోజుల తర్వాత ఆడిషన్‌కు రమ్మని పిలిచారు. హీరోయిన్ అవ్వాలని రంగుల ప్రపంచంలో వెలిగిపోవాలని ఆడిషన్స్‌కు వెళ్లింది. చుట్టూ ఇరవై మంది నిలబడి కెమెరా ఆన్‌ చేసి బట్టలన్నీ విప్పేయమని చెప్పారు.
 
ఎందుకు విప్పమన్నారో అర్థం కాలేదు.. తర్వాతే అర్థమైంది అది ఓ పోర్న్‌ సినిమా షూటింగ్‌ అని. సాకీ భయంతో కేకలు పెట్టింది. కానీ, 20 మంది మృగాళ్ల ముందు ఓడిపోయింది. ''నేను ఈ పని చేయలేను అని ఎంతో ఏడ్చాను. కానీ, 20 మందితో పోరాడడానికి నా బలం సరిపోలేదు. అప్పటికి నేను వర్జిన్‌ను. కానీ, బలవంతంగా నాతో సెక్స్‌ చేయించారు. ఒకేరోజు నలుగురితో శృంగారంలో పాల్గొనేలా చేశారు. చెప్పకూడని చేయరాని పనులన్నీ చేయించారు'' అని ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వాపోయింది.
 
ఆ చీకటి ప్రపంచం నుంచి బయటపడే మార్గం లేకపోయింది. ఎందుకంటే రెండేళ్ల పాటు ఆ కంపెనీతో పనిచేస్తానని ఆమె సంతకం పెట్టింది. ఒక వేళ ఎదురించి బయటకు వస్తే కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించారు. ఒకసారి పోర్న్‌ సినిమాలో కనబడి బయటకు వస్తే వేరెవ్వరూ ఉద్యోగం ఇవ్వరు. అందుకే రాజీ పడిపోయి పోర్న్‌స్టార్‌గా మారిపోయింది సాకీ. ఇప్పుడు ఆ కంపెనీ నుంచి బయటపడి పోయినా.. వేరే దారిలేక ఇప్పటికీ ఫ్రీలాన్స్‌డ్‌ పోర్న్‌ యాక్ట్రస్‌గానే కొనసాగుతోంది.