శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : శుక్రవారం, 27 డిశెంబరు 2019 (14:15 IST)

ద్విపాత్రాభినయంతో మెప్పించనున్న హీరో...

విభిన్న కథాంశం గల చిత్రాలను ఎంచుకుంటూ ఇటు తమిళంలోనూ, అటు తెలుగులోనూ వరుస హిట్‌లు సాధిస్తున్నాడు తమిళ హీరో కార్తి. ఇటీవల విడుదలైన ‘ఖైదీ’, ‘దొంగ’ సినిమాలు హిట్ టాక్ తెచ్చుకుని మంచి కలెక్షన్లు రాబట్టాయి.
 
అయితే సినీ వర్గాల సమాచారం ప్రకారం.. కార్తి త్వరలో పి.ఎస్‌.మిత్రన్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై ఇంకా అధికారిక ప్రకటన ఏదీ వెలువడకపోయినప్పటికీ ఈ సినిమాలో కార్తి ద్విపాత్రాభినయం చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. 
 
వచ్చే ఏడాదిలో షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కార్తీ ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లో నటిస్తున్నారు. కల్కి రచించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ పుస్తకం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తీతో పాటుగా ఐశ్వర్య రాయ్‌, ప్రకాశ్‌ రాజ్‌ కీలకపాత్రలు పోషిస్తుండగా ఈ సినిమా షూటింగ్ ఇటీవల థాయ్‌ల్యాండ్‌లో ప్రారంభమైంది.