ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : శనివారం, 16 నవంబరు 2019 (18:11 IST)

యాంగ్రీ హీరో కార్తీ లేటెస్ట్ మూవీ టైటిల్ ఇదే

యాంగ్రీ హీరో కార్తీ ఇటీవల విడుదలైన ‘ఖైదీ’ చిత్రంతో ఎమోషనల్‌ హిట్‌ సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘దొంగ’గా మరో ఘన విజయాన్ని అందుకునేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు కార్తీ. వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ ప్రొడక్షన్‌ పతాకాలపై జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో ఎమోషనల్‌ మూవీగా రూపొందుతున్న చిత్రానికి ‘దొంగ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
 
ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని వయాకామ్‌ 18 స్టూడియోస్‌, సూరజ్‌ సదానా నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో కార్తీ వదిన, హీరో సూర్య సతీమణి జ్యోతిక ఓ కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం.
 
మెగాస్టార్‌ చిరంజీవి కెరీర్‌ని మలుపు తిప్పిన ‘ఖైదీ’ టైటిల్‌తో కార్తీ ఇటీవల బ్లాక్‌బస్టర్‌ హిట్‌ని అందుకున్నారు. ఇప్పుడు మెగాస్టార్‌ చిరంజీవి మరో సినిమా ‘దొంగ’ టైటిల్‌తో వస్తున్నారు. గతంలో మెగాస్టార్‌ చిరంజీవి కూడా ‘ఖైదీ’ తర్వాత ‘దొంగ’ సినిమా చేయడం విశేషం. యాంగ్రీ హీరో కార్తీ, జ్యోతిక, సత్యరాజ్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్‌.డి.రాజశేఖర్‌, సంగీతం: గోవింద్‌ వసంత, నిర్మాతలు: వయాకామ్‌ 18 స్టూడియోస్‌, సూరజ్‌ సదానా, దర్శకత్వం: జీతు జోసెఫ్‌.