శుక్రవారం, 1 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 27 నవంబరు 2015 (12:07 IST)

కృతిసనన్- వరుణ్ ధావన్ కెమిస్ట్రీ అదుర్స్.. దిల్ వాలే సాంగ్‌లో..!

1 నేనొక్కడినే- దోచెయ్ సినిమాలతో చక్కని ఫెర్‌ఫార్మమ్‌గా కృతిసనన్ గుర్తింపు సంపాదించుకుంది. ఆ రెండు సినిమాల తర్వాత తెలుగు సినిమాలకు సంతకాలు చేసింది లేదు. ప్రస్తుతం బాలీవుడ్‌లో దిల్ వాలే చిత్రంలో వరుణ్ ధావన్ సరసన నాయికగా నటిస్తోంది. షారూక్ ఖాన్-కాజోల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో యువ జంటగా ఈ జోడీ ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయనున్నారు.
 
తాజాగా మన్మా ఎమోషన్ జాగే అంటూ ఈ యువజంటపై తెరకెక్కించిన సాంగ్ బిట్‌ని నెట్‌లో రిలీజ్ చేశారు. ఈ పాట వెరీ స్పెషల్ .. థ్రిల్ కలిగించే స్టంట్స్ సాంగ్ మధ్యలో ఉంటాయి. ఖరీదైన కార్లతో డిఫరెంట్ సెటప్‌లో యాక్షన్ పాట మధ్యలో వచ్చి వెళుతుంటుంది. ఫేమస్ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా ఈ చిత్రానికి కొరియోగ్రపీ చేశారు. ఈ పాటను చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.